mt_logo

రామక్క పాటతో కాంగ్రెస్, బీజేపీ గుండెలు జల్లుమంటున్నాయి: మంత్రి హరీష్ రావు

దుబ్బాక రోడ్ షో లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోతో పాటు రామక్క పాటను కూడా కాంగ్రెస్, బీజేపీ నఖల్ కొట్టాయని ఎద్దేవా చేశారు. రామక్క పాట తెలంగాణలో దుమ్ము రేపుతున్నది. పార్టీ కాదు, కేసీఆర్ మీద ప్రేమతో కల్వకుర్తికి చెందిన ఒక చెల్లి రాసిన పాటకు కాంగ్రెస్, బీజేపీ గుండెలు జల్లు మంటున్నాయని అన్నారు. రామక్క పాటలు ఎక్కడ కొట్టుకపోతమో అని భయపడుతున్నయని పేర్కొన్నారు. కొత్త ఏడాది జనవరి నుండి మన ప్రభుత్వం వస్తుంది,  రేషన్ మీద పాత సోనా మసూరి సన్నబియ్యం ఇవ్వబోతున్నం అని వివరించారు. నూకలు బుక్కుమన్న బీజేపీకి నూకలు లేకుండా చేయాలి.