mt_logo

9 ఏండ్లలో తెలంగాణ సర్కార్ వైద్య రంగానికి 73,888 కోట్లు కేటాయింపు : మంత్రి హరీశ్ రావు

అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యం పై చర్చ – మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. “It is health that is real wealth and not pieces of gold and silver.”  అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాం. గాంధీ కన్న కలలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు నిజం చేస్తున్నారు. 

వైద్యం, ఆరోగ్యం గురించి ఈ సభలో మాట్లాడాల్సిన వచ్చిన ప్రతీ సారీ నాకు గతం గుర్తొస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు, సిరంజీలు, సెలైన్ బాటిల్ స్టాండ్లు, బ్యాండేజి, కాటన్ లాంటి కనీస సదుపాయాలు కావాలని అడిగే వాళ్ళం. జ్వరాలకు, అంటు వ్యాధులకైనా మందులు సరఫరా చేయాలని, కుక్క కాటు, పాము కాటు, తేలు కాటు ఇంజెక్షన్లు అందుబాటులో పెట్టమని కోరేవాళ్లం. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా పోయింది. అలా అడిగే అవసరం లేకుండా పోయింది. 

తెలంగాణ రాష్ట్రం సిద్దించాక, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే ప్రజావైద్యం దారిలోకి వచ్చింది. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి. సర్కార్ దవాఖాన గతంలో ప్రజల లాస్ట్ ఛాయిస్, అయితే నేడు ఫస్ట్ ఛాయిస్. వైద్యారోగ్య రంగంలో ఆవరించిన నిరాశ, నిస్పృహలను తన దీక్షాదక్షతలతో తొలగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వరాష్ట్ర ఏర్పాటుతో మొదలైన తెలంగాణ వైద్యారోగ్య విప్లవం.. సత్ఫలితాలు సాధిస్తూ,  తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలిపింది.

పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వైద్యంపై  చేసిన కేటాయింపు 14,752 కోట్లు అయితే, 9 ఏండ్ల తెలంగాణ పాలనలో వైద్యంపై చేసిన కేటాయింపు 73,888 కోట్లు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2013-14లో హెల్త్ బడ్జెట్ 2706 కోట్లు ఉంటే,ఈ ఒక్క ఏడాది ఇప్పుడు 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నం. హెల్త్ బడ్జెట్ ను ఆరింతలు పెంచుకున్నం.  ముఖ్యమంత్రి గారి ఆలోచన చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. 

రోగాలు వచ్చాక వైద్యం అందించడంతో పాటు, అసలు రోగాలే రాకుండా అడ్డుకునేలా అద్భుతమైన పథకాలను సీఎం కేసీఆర్ గారు ప్రారంభించి అమలు చేస్తున్నారు.

-స్వచ్ఛమైన గాలి లభించేలా హరితహారం..

-పరిశుభ్రతను పెంచేలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి..

-ఉపరితల శుద్ధ జలాలు అందించేలా మిషన్‌ భగీరథ..

-నాణ్యమైన పంటలు పండేందుకు కాకతీయ, కాళేశ్వర జలాలు..

-స్వరాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెలుగా అభివృద్ధి చేసుకున్నం. 

ఇప్పటి వరకు ఉన్నవి:

ప్రాథమిక (పీహెచ్సీ, సీహెచ్ సీ)

ద్వితీయ (ఏహెచ్, డీహెచ్)

తృతీయ (టీచింగ్ ఆసుపత్రులు)

కొత్తగా ఏర్పాటు:

ప్రివెంటివ్: పల్లె దవాఖాన మరియు బస్తీ దవాఖాన

సూపర్ స్పెషాలిటీ: టిమ్స్ ఆసుపత్రులు

70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ఇంకా మూడంచెల వ్యవస్థనే అనుసరిస్తే, 9 ఏండ్ల తెలంగాణ ముందు చూపుతో వ్యవహరించి ఐదంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అమలు చేస్తున్నది. 

1, పల్లె దవాఖానలు.. బస్తీ దవాఖానలు.. 

  • 3206 పల్లె దవాఖానలు ఏర్పాటు 
  • పల్లె వద్దకు వైద్యులను తీసుకువచ్చాం.
  • మా పల్లె దవాఖానలు గస్తీ కాస్తున్నాయి. పల్లె ప్రజల జీవితాలకు ఆరోగ్య భరోసా అందిస్తున్నాయి.

434 బస్తీ దవాఖానలు

ప్రజల సుస్తీని దూరం చేసి బస్తీ వాసులకు 2 కోట్ల ఓపీ సేవలందించాయి.

తెలంగాణ డయాగ్నోస్టిక్స్..ద్వారా పల్లె, బస్తీ దవాఖానల్లో 134 రకాల పరీక్షలు

ప్రైవేటులో అయితే పది వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి.

2018 లో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 64 లక్షల మందికి 11 కోట్ల పరీక్షలు నిర్వహించాం. 

2, పీహెచ్సీలు మరియు యూ పీహెచ్సీలు:

  • మండలానికో పీహెచ్సీ చొప్పున 680 కి పెంపు
  • 40 మండలలాకు 40 కొత్త  పీహెచ్సీలు
  • 1000 మంది మెడికల్ ఆఫీసర్ల నియామకం చేశాం.
  • యూ పీహెచ్ సీల సంఖ్య 232 కు పెంపు 
  • తొలిసారిగా రెగ్యులర్ స్టాప్ నియామకం చేస్తున్నాం.
  • రెగ్యులర్ డాక్టర్స్, నర్సింగ్, సూపర్వైజర్ స్టాఫ్ ఏర్పాటు చేస్తున్నాం. 

3, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు

  • నాడు 49 నియోజకవర్గాల్లో మాత్రమే 100 పడకలు ఉంటే, నేడు 107 నియోజకవర్గాల్లో వంద లేదా అంతకు పైగా పడకలు ఏర్పాటు
  • ప్రతిపక్షాల అందరి నియోజకవర్గాల్లో తెలంగాణ వచ్చిన తర్వాతే ఆసుపత్రులు వచ్చాయి.

4, జిల్లాకో మెడికల్ కాలేజీలు..

నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు 3 మెడికల్ కాలేజీలు ఉండే. ఉస్మానియా మెడికల్ కాలేజీ 1856, గాంధీ ఆసుపత్రి 1954లో ప్రజలు చందాలతో పీపుల్స్ మెడికల్ కాలేజీగా ప్రారంభం కాగా, కాకతీయ మెడికల్ కాలేజీని 1959లో వరంగల్ రీజినల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించింది. ఇలా ఏర్పాటైన మూడు మెడికల్ కాలేజీల విషయంలో ఉమ్మడి పాలకుల పాత్ర శూన్యం.   

మార్చి 4, 2008 నాడు ఇదే అసెంబ్లీలో నేను మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాను. ‘కడపలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు. నాలుగు జిల్లాలున్న రాయలసీమలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పది జిల్లాలు ఉన్న తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మంత్రులు ఏం చేస్తున్నారు. ఇదేనా తెలంగాణ అభివృద్ధి అంటే.’ అని నిండు సభలో ప్రశ్నించాం. నాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. 

గులాబీ జెండా పుట్టి, మా వాటా ఏంటని ప్రశ్నిస్తే ఉద్యమం నుంచి వచ్చినవి రెండు పార్టీలు. ఆదిలాబాద్ రిమ్స్ 2008, నిజామాబాద్ మెడికల్ కాలేజీని 2013 లో ఏర్పాటు. ఆనాడు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు ఎంత కుట్ర పూరితంగా ఉండేవో ఇదే నిదర్శనం. 

నాడు అలాంటి పరిస్థితి ఉంటే, నేడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్.

60 ఏళ్లలో రెండు, 9 ఏండ్లలో 29 కాలేజ్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు కేసీఆర్.

వైద్యంతో పాటు, వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. మన పిల్లలు డాక్టర్ కావాలని పక్క రాష్ట్రాలు , పక్క దేశాలకు వెళ్లేవారు. కరోనా సమయంలో అక్కడ ఎంతో ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో ఉంటూ డాక్టర్ చదివేలా 33 జిల్లాల్లో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు సీఎం కేసీఆర్

2022-23 విద్యా సంవత్సరంలో కొత్తగా దేశంలో వచ్చిన మెడికల్ సీట్లు 2200 అయితే అందులో 900 తెలంగాణలోనే ఏర్పాటు అయ్యాయి. అంటే 43 శాతం సీట్లు తెలంగాణ నుంచే వచ్చాయి. ఇది మా పనితీరుకు నిదర్శనమని తెలిపారు. నాడు ఇదే అసెంబ్లీలో మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ నాయకత్వంలో పోరాడితే, నేడు అదే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య మంత్రిగా జిల్లాకొక మెడికల్ కాలేజీ పెట్టే అవకాశం రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల విజయం. ఇది కేసీఆర్ విజయం.బీఆర్ఎస్ ప్రభుత్వ విజయం.

నాటి కిరణ్ కు నేటి కేంద్రాని తేడా లేదు. చిత్తూరు జిల్లాకు నీళ్ల కోసం 10వేల కోట్లు పెట్టుకుంటే, ఇదే అసెంబ్లీలో తెలంగాణకు మంచి నీళ్ల కోసం నిధులు ఎందుకు ఇవ్వు అని అడిగాను. ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో పో అన్నాడు. నాటి కాంగ్రెస్ నాయకులు వెకిలి నవ్వులు నవ్వుతూ శాపం లాగా మారారు.

దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వకుండా పెదవులు విప్పకుండా పాపం లాగా బీజేపీ పార్టీ మారింది. అందుకే ఇవ్వాల తెలంగాణ ప్రజలు శాపం లాంటి కాంగ్రెస్ వద్దు, పాపం లాంటి బీజేపీ వద్దు అని, దీపం లాంటి కేసీఆర్ కావాలని అంటున్నారు.  పెరిగిన మెడికల్ కాలేజీల్లో సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని, ఎంబీబీఎస్‌ బి-  కేటగిరీ సీట్ల నిబంధనలో మార్పు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో అన్ రిజర్వుడు కోటాను వంద శాతం తెలంగాణ బిడ్డలకు వచ్చేలా  చేశాం. 

పాల ఉత్పత్తి పెంచి వైట్ రెవల్యూషన్, హరితహారంతో గ్రీన్ రెవల్యూషన్, గొర్రెల పంపిణీతో పింక్ రెవల్యూషన్, చేపల ఉత్పత్తితో బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్ కు నాంది పలికింది. 

-ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 తెలంగాణ

-డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ 1 తెలంగాణ

-వ్యవసాయంలో అగ్రగామి

-వైద్యంలోనూ అగ్రగామి 

ఇవి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు

-ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు (నెంబర్ 1 స్థానం)

-ప్రతి లక్ష జనాభాకు 8 పీజీ సీట్లు (నెంబర్ 2 స్థానం)

-దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ ఎలా మారిందో, డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణ కాబోతున్నది. 

-కాంగ్రెస్ పాలిత కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి బియ్యం కోసం దరఖాస్తు పెట్టారు. చత్తీస్ గడ్ నుంచి వైద్యం కోసం వస్తున్నారు

-తెలంగాణ పిల్లలు తెలంగాణలో చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో పని చేస్తారు

డబుల్ ఇంజన్ రాష్ట్రాలు వచ్చి డబ్బా కొడుతున్నాయి. ఇక్కడికి వచ్చి ఊదరగొడుతున్నారు. నీతి అయోగ్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే, కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌ 16వ ర్యాంకులో, చత్తీస్‌గడ్‌ 10వ స్థానంలో,  హిమాచల్‌ ప్రదేశ్‌ 7వ స్థానంలో ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కారున్న బీజేపీ రాష్ట్రాలైన యూపీ 19 (పెద్ద రాష్ట్రాల్లో చిట్ట చివర), మధ్యప్రదేశ్ 17 స్థానంలో ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కూడా మనకంటే వెనక 6వ స్థానంలో ఉంది.  తెలంగాణ నీతి అయోగ్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా మొదటి స్థానం చేరుతామనే నమ్మకం ఉందన్నారు.  

5, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

-కాంగ్రెస్ పాలనలో పేదల వైద్యం గురించి ఆలోచించారా.. జనాభా అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు ఏర్పుటు చేశారా? అదే నిమ్స్, గాంధీ, ఉస్మానియా తప్ప కొత్తది రాలేదు.  

-సీఎం కేసీఆర్ గారు, నిమ్స్ కు అదనంగా మరో నిమ్స్తో 4వేల పడకలు.దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రికార్డు.  నిలోఫర్ కు అదనంగా మరో నిలోఫర్ ను 2000 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసుకున్నం. దేశంలోనే అతిపెద్ద చిన్న పిల్లల ఆసుపత్రిగా రికార్డు. 

-ఎంఎన్జేకు అదనంగా మరో ఎంఎన్జే నిర్మించి పడకల సంఖ్యను 800 చేసుకున్నం.

-నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ద్వారా 4 వేల పడకలు

-గాంధీ, నిమ్స్, అల్వాల్ టిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ల ఏర్పాటు

-2100 పడకల వరంగల్ హెల్త్ సిటీ ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తాం

-మొత్తంగా 10వేల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నాం.  

-కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే  ప్రపంచ స్థాయి రోబోటిక్ వైద్య సేవలను నిమ్స్, ఎంఎన్జే ఆసుపత్రుల్లో ప్రారంభించి, పేద ప్రజలకు ఉచితంగా అత్యున్నత, అధునాతన వైద్య సేవలు అందిస్తున్నాం. 

-156 కోట్లు సీఎం కేసీఆర్ గారు నిమ్స్ అభివృద్ధి కోసం ఇచ్చారు. 

-17 వేల పడకల నుంచి 34 వేలకు పెంచుకున్నం, ఏడాదిలోపు 50 వేల పడకలు దాటుతున్నయి. 

-కరోనా కాదు, దాని తాత లాంటి వైరస్ లు వచ్చినా ఎదుర్కొనేలా తెలంగాణ వైద్యారోగ్య వ్యవస్థ నూతన శక్తిని సంతరించుకున్నది.

-విల్, విజన్, విస్డం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది సాధ్యపడింది.

హైదరాబాద్ వైద్యారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యం..

-ఉమ్మడి పాలనలో ఆరోగ్య రంగంలో హైదరాబాద్ తీవ్ర వివక్షకు గురైంది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏనాడైనా ఆసుపత్రులు ఏర్పాటు చేశారా..?

-పది లక్షల జనాభా ఉన్న జిల్లాకు ఒక జిల్లా వైద్యాధికారి, కోటి జనాభా ఉన్న హైదరాబాద్ కు ఒక జిల్లా వైద్యాధికారి. ఇది గత పాలకుల వింత పాలనకు నిదర్శనం. ఏండ్ల తరబడి ఇదే పద్ధతి కొనసాగుతున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. జనాభా అవసరాలు తీర్చేలా జిల్లా వైద్యాధికారులను పెంచాలని ఆలోచన చేయలేదు. 

-ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లకు 6 డీఎంహెచ్వో పోస్టులు ఏర్పాటు చేశారు. 

-గాంధీలో ఫెర్టిలిటీ సెంటర్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నం

-గాంధీ, నిమ్స్, అల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ లు ఏర్పాటు చేస్తున్నం. 

-జీహెచ్ఎంసీలో 350  బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. 

-తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 రకాల పరీక్షలు చేస్తున్నం. 

-అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ ను అధునాతన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేందుకు, మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్యలు తీసుకున్నరు.  

ఉస్మానియా ఆసుపత్రి..

-2015 లో సీఎం కేసీఆర్ గారు ఉస్మానియా సందర్శించి, కొత్త ఆసుపత్రి నిర్మాణం చేస్తామని ప్రకటించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఆలస్యమవుతున్నది. 

-చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, అఫిడవిట్ రూపంలో అందరి సమ్మతిని కోర్టుకు విన్నవించడం జరిగింది. హైకోర్టు తీర్పు వచ్చిన వెనువెంటనే 2000 పడల ఉస్మానియా నూతన బిల్డింగ్ నిర్మాణం చేస్తాం. 

-గుడి, మసీదు ఇబ్బంది కలగకుండా నిర్మాణాలు చేస్తం. 

-ఇన్ పేషెంట్స్ లేరు. సర్జరీలు జరుగుతా లేదు, డెలివరీలు లేవు. దాని పరిస్థితి ఎలా ఉందంటే మా పీహెచ్‌సీకి ఎక్కువ బస్తీ దవాఖానకు తక్కువ అన్నట్లు ఉంది. ఎయిమ్స్ స్థాయిని దిగజార్చింది బీజేపీ ప్రభుత్వం. 

-విద్యార్థులకు ప్రాక్టికల్స్ లేవు. భువనగిరి ఆసుపత్రిలో అవకాశం.

-మీ AIM బీబీ నగర్ ఎయిమ్స్ లాగా ఉంటే, మా AIM వరంగల్ హెల్త్ సిటీ రేంజ్ లో ఉంటది. 24 అంతస్తుల ఎత్తులో ఉంటది.

-అంటే మీ లక్ష్యాలు, ఆలోచనలు, ఆచరణలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

మాతా శిశు సంరక్షణ..

-మాతా శిశు సంరక్షణను నాటి కాంగ్రెస్ విస్మరించింది. 

-కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయ్యింది. అమ్మఒడి వాహనాలు..

-ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన మరో అద్భుతమైన పథకం అమ్మఒడి -102 వాహన సేవలు.

-300  అమ్మఒడి వాహనాలు రోజుకు 4 వేల గర్బిణులకు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 లక్షల మంది గర్బిణులు లబ్ధిపొందారు. 

-350 మందికి మిడ్ వైఫరీ శిక్షణ

-56 టిఫా స్కాన్ ఏర్పాటు, 6 నుంచి 28 పెంచిన ఎంసీహెచ్ లు 

350  ప్రసూతి కేంద్రాల ఆధునీకరణ. (ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం)

-న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లు 56కు పెంపు

-ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు 30 నుంచి 70

-ఎఎంఆర్ -92 నుంచి 43 (దేశ సగటు -97)

-ఐఎంఆర్- 39 నుంచి 21 ( దేశ సగటు-28)

-వ్యాక్సినేషన్ -68శాతం నుంచి 100 శాతం ( దేశ సగటు-79శాతం)

-ఇనిస్టిట్యూషన్ డెలివరీలు -91శాతం నుంచి 100శాతం (దేశ సగటు 79)

-ఇవన్నీ మేము చెబుతున్నవి కాదు, కేంద్రం చెప్పిన లెక్కలు.

-ముఖ్యమంత్రి గారి దార్శనికత, మా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చిత్తశుద్ధి వల్లనే ఈ ఫలితాలు సాధించాం. 

ఆరోగ్య మహిళ…

-మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించిన “ఆరోగ్య మహిళ” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. 

-ప్రతి మంగళవారం నాడు పూర్తిగా మహిళా వైద్య సిబ్బంది ఉండి 272 ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా మహిళలకు 8 రకాల వైద్య సేవలు అందిస్తున్నం.

-ఈ ఏడాది మార్చి 8 నుంచి ఆగస్టు 1 వరకు 22 మంగళవారాల్లో 2 లక్షల మందికి సేవలు అందించాం. 

కంటి వెలుగు..

-ప్రపంచంలోనే ఇంత పెద్ద కంటి పరీక్షలు తెలంగాణలో మాత్రమే జరిగాయి. మొదటి విడతలో కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ

-రెండో దఫాలో కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి, 41 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం.  

-కంటివెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరివింద్‌  కేజ్రివాల్‌, పంజాబ్‌ సీఎంభగవంత్‌ సింగ్‌ మాన్‌, కేరళ సీఎం పనరయి విజయన్ లు మెచ్చి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామని ప్రకటించడం మనమందరం చూశాం. 

-రజినీ కాంత్ కు మన అభివృద్ధి కనిపిస్తున్నది కానీ, ఇక్కడున్న కాంగ్రెస్ వారికి కనిపించడం లేదు.

-పక్క రాష్ట్ర రజినీలకు కనిపించింది కానీ, ఇక్కడున్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు. 

ఆరోగ్య శ్రీ మరియు సీఎంఆర్ఎఫ్..

-మంచి ఎక్కడున్నా స్వీకరిస్తాం, మంచి పథకాలను కొనసాగిస్తాం. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 

-ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించే పరిధిని 2 లక్షలనుండి 5 లక్షలకు పెంచి, 90 లక్షల  కుటుంబాలకు వర్తింపు చేసింది.

-ట్రాన్స్ ప్లాంట్ల విషయంలో పది లక్షల వరకు ఉచిత సేవలు అందిస్తున్నది.  

సులభతర సేవలు పొందేందుకు డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నాం.

-ఆయుష్మాన్ భారత్ కాకుండా రాష్ట్ర సొంత నిధులతో అందిస్తున్న ఆరోగ్య శ్రీ పై కేంద్రం ప్రశంసలు కురిపించింది.

-2014 జూన్ 2 నుంచి  2023 మే 18 వరకు 16 లక్షల కుటుంబాలకు 7వేల కోట్లు విలువైన చికిత్స ఉచితంగా అందించడం జరిగింది, 

-దీనికి అదనంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ – ఎల్ వో సీ ద్వారా గడిచిన 9 ఏండ్లలో 6 లక్షల కుటుంబాలకు 3 వేల కోట్లు వైద్యం కోసం అందించాం. సీఎం కేసీఆర్ గారు పేదల పక్షపాతి అని చెప్పేందుకు ఇది నిదర్శనం.

-2004 నుంచి 2014 వరకు (కాంగ్రెస్ పాలన) చూస్తే 1.85లక్షల లబ్ధిదారులకు, 756 కోట్లు మాత్రమే.

-సీఎంఆర్ఎఫ్ కోసం ఎవ్వరు దరఖాస్తు ఇచ్చినా, పార్టీలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న మనసున్న నాయకుడు మా సీఎం గారు. 

-ఆరోగ్య శ్రీ ద్వారా 7వేల కోట్లు, సీఎంఆర్ఎఫ్, ఎల్ వో సీ ద్వారా 3వేల కోట్లు మొత్తంగా 10వేల కోట్లు 20 లక్షల కుటుంబాల ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం జరిగింది. 

డయాలసిస్‌ సెంటర్లు…

-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలో మాత్రమే ఉండే. 

-డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 102  కి పెంచాం.

-ములుగు, ఏటూరు నాగారంలో కూడా డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 

-ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నం.

-సీఎం కేసీఆర్ గారు, డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌కూడా ఇస్తున్నము. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌ జరుగుతున్నాయి.

-ట్రాన్సా ప్లాంట్‌ సర్జరీ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా (15 వేలు విలువ చేసే) జీవిత కాలం అందిస్తున్నాము.

-రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్‌ చేయిస్తోందన్నది 

-డయాలసిస్‌ రోగులకు పింఛను ఇస్తున్నాం.  కేవలం డయాలసిస్ కోసమే ప్రతి ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేసున్నాం.

-నిమ్స్ లో 150 మిషన్లతో దేశంలో అతిపెద్ద డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం.

108, పరమపద వాహనాలు..

-2014లో 321 గా ఉన్న 108 అంబులెన్సులు సంఖ్యను 455 కి పెంచాం. మొన్ననే 

-నాడు ఫోన్ చేసిన 30 నిమిషాల్లో అంబులెన్స్ చేరితే, నేడు ఆ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించాం 

-సీఎం కేసీఆర్ గారి మానవతా కోణానికి నిదర్శనం పరమపద వాహనాలు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఇక వారి బంధువులకు అరిగోసనే ఉండేది. అప్పటికే వైద్యం కోసం చేసిన ఖర్చు, ఇటు మరణం మిగిల్చిన బాధ, వీటికి తోడు వాహనాలకు కిరాయి చెల్లించలేని స్థితిలో పేదలకు ఏమి చేయాలో దిక్కుతోచక ఏడ్చేవారు. ఇంతటి హృదయ విదారకర సన్నివేశాలు కళ్ల ముందు కనిపించినా, గత పాలకులకు ఏనాడు దీనికో పరిష్కారం కనుక్కుందామనే మనసు రాలేదు. 

-పైసా ఖర్చు లేకుండా మృతదేహాలను తరలించేలా పరమపద వాహనాలు ఏర్పాటు 

రిక్రూట్మెంట్స్… 

వైద్యారోగ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 22,455 పోస్టుల భర్తీని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. డాక్టర్లు, నర్సులు, పారామెడిక్ సహా ఇతర సిబ్బందిని నియమించింది. 

5204 స్టాఫ్ నర్సుల భర్తీ, 1520 ఏఎన్ఎం పోస్టుల భర్తీ, 156 ఆయుష్ డాక్టర్ల భర్తీ కొనసాగుతున్నది. ఇవీ కూడా పూర్తయితే ఒక్క ఆరోగ్య శాఖలోనే మొత్తం 30వేల పోస్టుల భర్తీ పూర్తి అవుతుంది.  

నూతన సంస్కరణలు..

-హాస్పిటళ్లలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం కోసం, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించి.. ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచింది. 

-టీ.బి., క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాం. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయలనుంచి 80 రూపాయలకు పెంచాం

-రోగితో పాటు వచ్చే అటెండెంట్ల గురించి కూడా ఆలోచించారు కేసీఆర్ గారు. హైదరాబాద్‌ లోని 18 మేజర్‌ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగితో ఉండే సహాయకులకు రూ.5కే మూడు పూటలా భోజన సదుపాయం కల్పించాము. ప్రతి రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతోంది.

-ఇలా విప్లవాత్మకమైన నిర్ణయాలు, మానవీయతతో కూడుకున్న పథకాలు ప్రారంభించి, అమలు చేసి అట్టడుగున ఉన్న ఆరోగ్య రంగాన్ని, ఆకాషమంత ఎత్తుకు చేర్చిన మహనీయుడు కేసీఆర్ 

-తెలంగాణను అన్నపూర్ణ గానే కాదు, ఆరోగ్య ప్రదాయినిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంది. 

-అందుకే తెలంగాణ సాధించిన వైద్యారోగ్య రంగం పురోగతిపై కేంద్ర ప్రభుత్వ అవార్డులు, నీతి అయోగ్‌ ప్రశంసలు లభించాయి. 

-అనేక అవార్డులు తెలంగాణకు వచ్చాయి.   కేడవార్ ఆర్గాన్ డొనేషన్ లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం. నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ డే కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి తెలంగాణకు అవార్డు అందజేశారు. 

ఆశాల జీతాలు…

-ఆశాల జీతాలు పెంచాలంటే గుర్రాలతో తొక్కించిన చరిత్ర నాటి కాంగ్రెస్ పాలకులది.సీఎం కేసీఆర్ గారు పిలిచి కడుపునిండా భోజనం పెట్టి జీతాలు పెంచారు. 

-2014 ముందు 2000 ఉంటే దాన్ని 9900 రూపాయలు పెంచాం. 

-మధ్యప్రదేశ్ 3000, రాజస్థాన్ 3000, ప్రధాని సొంత గుజరాత్ లో 4000, యూపీలో 5000, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 7000

-రెండో ఏఎన్ఎంల జీతాలు నాడు 8,800 ఉంటే  27,300 వేతనాలు ఇస్తున్నాం

-గుజరాత్ 17వేలు, మహారాష్ట్ర 16 వేలు, కర్ణాటకలో 12 వేలు. తెలంగాణ 27,300

-ఇంకా పెంచేందుకు ప్రయత్నం చేస్తాం. 

-నాడు గుర్రాలతో తొక్కిస్తరు, ముళ్ల కంచెలు వేస్తారు ఇయ్యాల వచ్చి నీతులు చెబుతున్నారు.

-నర్సింగ్, హౌస్ సర్జన్లు, పీజీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల స్టైఫండ్ పెంచుకున్నం.

-ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో మీ కాలంలో ఒక సంవత్సరం ఎరియర్స్ గా కొనసాగుతున్నది. 1866 కోట్లు మీ వారసత్వంగా వచ్చింది. ఆ ఎరియర్స్ క్లియర్ చేశాం.9 ఏళ్లలో 19619 కోట్లు ఫీజు రియంబర్స్ మెంట్ కింద ఖర్చు చేశాం. మీరు ఇచ్చినట్లు  మేము ఇవ్వనట్లు మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరికి ఒక్క రూపాయి లేకుండా ఫీజు రియంబర్స్ మెంట్ ఆగదు. అందరికీ అందిస్తాం.

-ప్రజలకిచ్చిన ప్రతి మాట సీఎం కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. గ్యారెంటీగా మూడోసారి బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. 

-శాపం లాంటి కాంగ్రెస్ వద్దు, పాపం లాంటి బీజేపీ వద్దు, దీపం లాంటి బీఆర్ఎస్ కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.