- సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం
- బంజారాహిల్స్ లో బంజారా భవన్
కొత్తగూడెంలో గిరిజనులకు శుక్రవారం రోజు పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చ నాగేశ్వర రావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధుల, అధికారులు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం. చాలా సంతోషం పోడు భూముల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతున్నది. మీకు ఎలాంటి భయం లేదు, పోడు గోడుకు వీడ్కోలు.. మీ వద్దకు ఇక ఏ అధికారి కూడా రాడు.
55 వేల రైతు కుటుంబాలకు సగటున 3 ఎకరాలు
రాష్ట్రం మొత్తం 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే, ఒక్క కొత్తగూడెం లో లక్షా 50 వేల ఎకరాలకు పట్టా. 55 వేల రైతు కుటుంబాలకు సగటున 3 ఎకరాలు వచ్చాయి. పట్టాలు అందుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ధరణిలో మీ పేరు ఎక్కడం, మీ పాస్ బుక్ రావడం. ఎకరాకు 10 వేలు రైతు బంధు డబ్బులు. ఏ కారణంతో చనిపోయిన రైతు బీమా కింద 5 లక్షలు. అటవీ అధికారుల వేధింపులు ఉండవు.మీ పై పెట్టిన కేసులు తొలగించేలా సీఎం గారి వద్దకు తీసుకువెళతాము. వారసత్వ హక్కు భూమిపై వస్తుంది. విద్యుత్ కనెక్షన్, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా..ఎరువులు, విత్తనాలు, పనిముట్లు సబ్సిడీ పొందుతారు.అకాల వర్షాలు పడితే ప్రభుత్వం అందించే పంట నష్టం. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చాం. మీరు నేటితో అర్హత పొందారు. కోఆపరేటివ్ డైరెక్టర్ గా కావొచ్చు.
బంజారాహిల్స్ లో బంజారా భవన్
బ్యాంకుకు వెళ్తే మీకు పాస్ బుక్ ద్వారా క్రాప్ లోన్ తెచ్చుకోవచ్చు. గిరిజన తండాలు పంచాయతీలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పింది. మా తండాల్లో మా రాజ్యం నినాదాన్ని సీఎం కేసీఆర్ నిజం చేశారు. బంజారాహిల్స్ లో బంజారా భవన్… మంచి పని చేసే కేసీఆర్ కావాలా నిండా ముంచే కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలి.