mt_logo

సెప్టెంబరు 2023 నాటికి 100% మురుగు నీటి శుద్ధి 

విచ్చలవిడిగా వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (STPs) అత్యంత కీలకం. వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్‌ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె. తారక రామారావు ప్రకటించారు. గతంలో ప్రకటించిన విధంగా ఈ నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనుల్లో దుర్గం చెరువు 7 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ట్రయల్‌ రన్‌ విజయవంతం అయ్యింది. ఇదే సమయంలో 15 ఎంఎల్‌డీ సామర్థ్యంతో కోకాపేటలో ఎస్టీపీ పనులు పూర్తి అయ్యాయి. ఈ కోకాపేట ఎస్టీపీని శనివారం పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. 

మంత్రి కేటీఆర్ ట్వీట్‌.. 

వాగ్దానం చేసినట్లుగా, సెప్టెంబరు, 2023 నాటికి 100% మురుగు నీటిని శుద్ధి భారతదేశంలో మొదటి నగరంగా హైదరాబాద్ అవతరిస్తుంది. ఇందులో భాగంగా, మేము ₹3,866 కోట్ల వ్యయంతో 1259.50 MLD తో  ఎస్టీపీలను నిర్మిస్తున్నాము. కోకాపేటలో 15 MLD సామర్థ్యంతో తొలి ఎస్టీపీని నేడు ప్రారంభించనున్నాము. మిగిలినవి కొద్ది నెలల్లోనే పూర్తి అవుతాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.