Mission Telangana

జేపిఎస్ లతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి పాలాభిషేకం

వరంగల్, మే 24 : తమను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన సీఎం కేసీఆర్ కు, మంత్రి ఎర్రబెల్లి కి ధన్యవాదాలు తెలిపిన జేపిఎస్ లు, జేపిఎస్ లతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎర్రబెల్లి ని కలిసిన జేపిఎస్ లు. 

 ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. 

మన సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు,  మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ ప్రక్రియను చేపట్టడం హర్షణీయమన్నారు. జేపీఎస్  లను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేశారు.ఆ కమిటీలు ప్రక్రియను చేపట్టి, నివేదికలు ఇస్తారు, కమిటీల నివేదికలు రాగానే జే పి ఎస్ లను రెగ్యులరైజ్ చేస్తాం. జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీ ల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన తరువాత హరీష్ రావు, నేను , చీఫ్ సెక్రటరీ సమావేశం అయ్యామన్నారు.  JPS ల రెగ్యులరైజ్ విధి విధానాలు చర్చించాము అన్నారు. జేపిఎస్ లు సీఎం కేసీఆర్ కు ఋణపడి ఉంటారు, Jps ల కుటుంబాలు జన్మ జన్మలా సీఎం కేసీఆర్ గారిని గుర్తు పెట్టుకుంటాయని అన్నారు.