ఆసరా పెన్షన్ లపై ఈరోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో గౌరవ సభ్యులు MS ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు.
కేటగిరీల వారీగా ఆసరా పెన్షన్ల వివరాలు:
తెలంగాణ ప్రభుత్వం 2014, అక్టోబర్ 1 నుండి 2014-15 సంవత్సరంలో ‘ఆసరా పింఛను’ పథకాన్ని ప్రారంభించింది.
ఆసరా పింఛను పథకం క్రింద 2023, జూన్ నాటికి కేటగిరీల వారీగా లబ్ధిదారులు:
– వృద్ధులు – 15 లక్షల 81 వేల 630
– వితంతువులు – 15 లక్షల 54 వేల 525
– వికలాంగులు – 5 లక్షల 5 వేల 836
– నేతకారులు – 37 వేల 51
– కల్లుగీత కార్మికులు – 65 వేల 196
– ఫైలేరియా రోగులు – 17 వేల 995
– డయాలసిస్ రోగులు – 4 వేల 337
– ఎన్.ఆర్.టి – హెచ్ఐవీ రోగులు – 35 వేల 670
– బీడీ కార్మికులు – 4 లక్షల 24 వేల 292
– ఒంటరి మహిళలు – 1 లక్ష 42 వేల 252
– మొత్తం – 43 లక్షల 68 వేల 784
నాడు – నేడు
2013 -14 తో పోల్చుకుంటే 2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య, వ్యయంలో భారీ పెరుగుదల ఉంది
- 2013-14 సంవత్సరంలో ఉన్న (తెలంగాణ ఏర్పడటానికి ముందు) 28 లక్షల 47 వేల 885 మంది లబ్ధిదారుల సంఖ్యతో పోల్చుకుంటే 2021-22 సంవత్సరంలో 37 లక్షల 59 వేల 966 మంది లబ్ధిదారులు ఉన్నారు
- పర్యవసానంగా, 2013 – 14 సంవత్సరంలో ఉన్న 809 కోట్ల 64 లక్షలతో పోల్చుకుంటే 2021-22 సంవత్సరంలో 8 వేల 581 కోట్ల 10 లక్షల పెరుగుదలతో 2021-22 సంవత్సరంలో 9 వేల 390 కోట్ల 74 లక్షలకు వ్యయం పెరిగింది. ప్రస్తుతం 2023-24 సంవత్సరంలో ఆసరా పథకం క్రింద 11 వేల 774 కోట్ల 90 లక్షలతో బడ్జెట్ కేటాయింపును చేయడమైంది.
గతంలో గ్రామ స్థాయి / మండల స్థాయి / వార్డు స్థాయి క్షేత్ర అధికారులు పింఛన్లు మంజూరు నిమిత్తం దరఖాస్తులను తీసుకునేవారు.
- 2022 – 23 సంవత్సరంలో కొత్త సంస్కరణగా, లబ్ధిదారులపై ఎటువంటి చార్జీలు వేయకుండా దరఖాస్తులను మీ సేవా కేంద్రాల ద్వారా తీసుకుంటున్నారు.
సామాజిక భద్రతతో జీవితాన్ని గౌరవప్రదంగా కొనసాగించడానికి వారి రోజువారీ కనీస అవసరాలను తీర్చడానికి పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయి, సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, హెచ్.ఐ.వి రోగులు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులను రక్షించడానికి ఆసరా పింఛను పథకం ఉద్ధేశించడమయింది.