mt_logo

వచ్చేసారి కూడా ప్రభుత్వం మనదే – పటాన్ చెరువు నుండి హయత్ నగర్ దాకా మెట్రో: సీఎం కేసీఆర్

తర్వాతి  ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి కేబినెట్ మీటింగ్ లోనే పటాన్ చెరువు నుండి హయత్ నగర్ దాకా మెట్రో పొడిగింపుకు మంజూరు చేస్తానని మాటిస్తున్నాని అన్నారు సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేస్తూ, ఇక్కడే సంగారెడ్డి గెస్ట్ హౌస్ లో పడుకుంటూ 3 రోజులు గల్లీ గల్లీ  ఈ పటాన్ చెరువులో నేను పాదయాత్ర చేశాను. ఇక్కడి సమస్యల్నీ నాకు తెలుసు. ఆ సమయంలో సదాశివ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పటాన్ చెరువు అభివృద్ధి పథంలో ముందుకుపోతున్నది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మహిపాల్ రెడ్డి గారు పటాన్ చెరువు దాకా మెట్రో విస్తరించాలని అడిగారు. పటాన్ చెరువు దాకా మెట్రో విస్తరించాలని అడుగుతున్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పటాన్ చెరువు నుండి హయత్ నగర్ దాకా మెట్రో రావాల్సిన అవసరముంది. అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది. మీరు మళ్ళీ గెలిపిస్తే వస్తుంది. తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి కేబినెట్ మీటింగ్ లోనే పటాన్ చెరువు నుండి హయత్ నగర్ దాకా మెట్రో పొడిగింపుకు మంజూరు చేస్తానని మాటిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత వాగ్దానం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని ప్రసంగించారు సీఎం కేసీఆర్.