తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఆంధ్రాలో వందెకరాలు కొనుగోలు చేయవచ్చని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేసారు. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతికి శంకుస్థాపన చేసిన తర్వాత బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇంత త్వరగా అంత అభివృద్ధి చెందుతుందని ఎవరూ ఊహించలేదు. నాడు తెలంగాణ ఏర్పడకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదెకరాలు కొనుకునే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నారని స్వయంగా చెప్పారంటే విషయం తారుమారైంది. తెలంగాణ భూములు ఎలా పెరిగాయో తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లావారిని సమైక్య శక్తులు కన్ఫ్యూజ్ చేశాయి. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. కానీ, పటాన్‌చెరువులో ఈ రోజున ఎకరం భూమి ధర ఎంత? ఆ రోజు ఎంత ఉండే? ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నది. ఎకరం భూమి రూ.30కోట్లు పలికితే చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చని సీఎం ప్రసంగించారు.