mt_logo

ఇది ఆయన కన్న కల.. గుక్కెడు నీళ్లకు ఏడ్చిన గడ్డ

నేడు నిండు కుండలా రిజర్వాయర్లు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వేళ నేడు “సంక్షేమ సంబురాల దినోత్సవం” రోజున ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ రావు గారు మంచిర్యాల జిల్లా పర్యటన చేపట్టారు..  హెలికాప్టర్ లో మంచిర్యాల వెళుతూ రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు గోదావరి నీటితో నిండివున్న దృశ్యాన్ని చూసిన సీఎం కేసీఆర్ కళ్లనుండి ఆనంద భాష్పాలు రాలాయి. నడి వేసవిలో కూడా నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టులను చూసి తనివి తీరా సంతృప్తి వ్యక్తం పడ్డారు. సుమారు 250 కిలోమీటర్ల మేర నీటితో, పచ్చని పంటపొలాలతో సజీవంగా మారడాన్ని చూసి సీఎం తన్మయత్వం చెందారు.  పదేండ్లలో సాధించిన సాగునీటి ప్రగతిని చూసి సీఎం ఆనందంలో మునిగారు.