mt_logo

మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 వ రోజున తలపెట్టిన ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు  పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మహాగని మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. 100 శాతం ఓడిఎఫ్ సాధించడంలో తెలంగాణ నంబర్ వన్. నంబర్ వన్ అంటే ఎవరు ? తెలంగాణ ప్రజలే కదా? సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరు అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి అద్భుతంగా పనులు జరుగుతున్నాయి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తుమ్మలూరుకు 1 కోటి రూపాయలతో కమ్యూనిటి హాల్ ను మంజూరు చేస్తున్నాను. ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా దీనికి ‘దశాబ్ది కమ్యూనిటి హాల్’ అని పేరు పెట్టమని నేను కోరుతున్నాను. 

ఈ పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ నిమిత్తం వెంటనే జీవో జారీ చేస్తాం. వీటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవలని కోరుతున్నాను.వీటితో పాటు జల్ పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో రూ. 25 కోట్లను మంజూరు చేస్తున్నాను. బడంగ్ పేట, మీర్ పేట మున్సిపాలిటీలకు చెరో రూ. 50 కోట్లను మంజూరు చేస్తున్నాను.ఈ శాఖా మంత్రి చాలా తపన పడి పని చేస్తారు కాబట్టీ ఈ నిధులను సద్వినియోగపరుచుకుంటారని మంజూరు చేస్తున్నా.. నీళ్ళు వస్తాయ్. మెట్రో కూడా మహేశ్వరం దాకా వస్తుంది.  బీహెచ్ఈఎల్ దాకా పొడిగించుకున్నాక  మహేశ్వరం దాకా వస్తుంది. మరో విడతలో మనమే వస్తాం కాబట్టి అన్ని పనులు చేసుకుందాం అంటూ సీఎం ప్రసంగించారు.