mt_logo

29వ తేదీన దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 వ తేదీకి వుంది. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజుకు మూలం నవంబర్ 29 కి ప్రత్యేక గుర్తింపు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి…కనుమరుగు అయ్యాయని గుర్తు చేసారు. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని ధైర్యంగా చెప్పింది కేసీఆర్. ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారు. నవంబర్ 29న ప్రతి సంవత్సరం తెలంగాణలో దీక్షా దివస్‌ను జరుపుకుంటున్నాము, ఈ సంవత్సరం సైతం దీక్షా దివస్‌ను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని సూచించారు. 

తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు,కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నవంబర్ 29న దీక్షా దివస్ ద్వారా తెలిపాలన్నారు. రేవంత్ రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉంది. పీఎం కిసాన్ యోజన పై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీ గోశామహల్,కరీంనగర్,కోరుట్ల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. 

దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాకు భర్తీ చేసిన రాష్ట్రం వుందా? అన్నారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం సంవత్సరానికి 16 వేల ఉద్యోగాలు ఇచ్చిందని వెల్లడించారు. డిసెంబర్ 4 నేనే స్వయంగా అశోక్‌నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్‌ను రూపొందిస్తానని మంత్రి తెలిపారు.