mt_logo

తల తెగి పడ్డ ఢిల్లీకి తల వంచము: మంత్రి కేటీఆర్

నిజామాబాద్: ఖిల్లారోడ్‌లో ఎమ్మేల్యే గణేష్ గుప్తాతో కలిసి రోడ్ షో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంది. అర్బన్ ఎమ్మేల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి నేనే సాక్ష్యం అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బాండ్‌కు దీటుగా నిజామాబాద్‌లో ట్యాంక్ బాండ్ ఏర్పాటు చేశారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేసామని తెలిపారు. 

సీఎం పీఠం కోసం మత ఘర్షణలు చేసే కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మత పరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు.  కామారెడ్డిలో పని చేయలేను షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో ఏం పని చేస్తాడు. కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతద? అని అడిగారు. మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్. 12 వేల కోట్ల రూపాయల నిధులు మైనారిటీ సంక్షేమం కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ వంటి మైనారిటీ గురుకులాలు ఉన్నాయా? ముస్లింలు అత్యధికంగా ఉన్న యూపీ,మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఇవ్వనన్ని నిధులు సీఎం కేసీఆర్ తెలంగాణలో ఇచ్చారు. సీఎం పీఠం కోసం మత ఘర్షణలు చేసే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దామా ఆలోచన చేయండన్నారు. 

కాంగ్రెస్‌ను నడిపోస్తున్నది ఒక పప్పు

కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రతి సారి ముస్లింలను మోసం చేసిందని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదు,భవిష్యత్తులో కూడా జత కట్టదని తేల్చి చెప్పారు. కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు భయపడేది లేదని స్పష్టం చేసారు.  తల తెగి పడ్డ ఢిల్లీకి తల వంచము. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలలో కావాలని కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్‌ను నడిపోస్తున్నది ఒక పప్పు. మోదీనీ ఎదుర్కోవటం కేవలం కేసీఆర్‌తో సాధ్యం అన్నారు. పొరపాటున కాంగ్రెస్ ,షబ్బీర్ అలీ ఓటు వేస్తే ఆయన మళ్లీ ఎక్కడ కూడా కనపడడని అభివర్ణించారు. 11 సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేస్తే బీజేపీకి ప్రయోజనం అవుతదని హెచ్చరించారు.