mt_logo

చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ లో మెట్రోకి ఎందుకు సహకరించడం లేదో తెలియాలి

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణకు రావాల్సిన పెండింగ్‌ అంశాలపై, పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాలు అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన కేంద్రం నుంచి స్పందన లేదు.  ఎస్ఆర్డీపీ కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసాము. కానీ రసూల్ పూర్ వద్ద మూడు నాలుగు ఎకరాల హోంశాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. రసూల్ పూర్ వద్ద మూడు నాలుగు ఎకరాల హోంశాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన స్పందన లేదు. ఈ విషయంలో అమిత్ షాను  కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు  కేంద్రం కలిసి రావాలి. పటాన్ చేరు నుంచి హయత్ నగర్ దాకా మెట్రో విస్తరణ కూడా కేంద్రం కలిసి రావాలి.

కిషన్ రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో..

తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని కొనసాగిస్తుందని అనిపిస్తుంది. ఒకవేళ కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. కిషన్ రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో తెలవదు. కిషన్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్ లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా  చూపించారు. ఉత్తర ప్రదేశ్ లో సుమారు 10 చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ లో ఎందుకు మెట్రోకి సహకరించాలడం లేదో తెలియాలి. హైదరాబాద్ లో వరదలు వస్తే సహకరించని కేంద్రం, గుజరాత్ లేదా ఇతర బీజేపీ రాష్ట్రాల్లో వరదలు వస్తే ఎందుకు నిధులిచ్చిందో కిషన్ రెడ్డి చెప్పాలి. నిస్సహాయంగా ఉన్న కిషన్ రెడ్డిని కంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము ఇవ్వగలం. తెలంగాణ రాష్ట్రం బీజేపీ పాలిత పేద రాష్ట్రాల అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్ర నిధులు ఉన్నాయి. ఈ విధంగా జాతి నిర్మాణంలో తెలంగాణ సహాయకారిగా ఉన్నందుకు బీజేపీ నేతలు  తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాలని మంత్రి అన్నారు.