mt_logo

సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవటం సంతోషానిస్తోంది: కేటీఆర్

సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవటం సంతోషానిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ను లైఫ్ సెన్స్ రంగం, మెడికల్ ఎక్విప్‌మెంట్ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ గారు హైదరాబాద్ లోని సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేశారు అని గుర్తు చేశారు.

ఆ పార్క్‌లో ఏర్పాటైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మొట్టమొదటి సారిగా స్టెంట్‌లను ఉత్పత్తిని చేశారు. ఆ సంస్థకు సంబంధించిన స్టెంట్లు నేటి నుంచి మార్కెట్‌లోకి రానుండటం ఎంతో సంతోషానిస్తోంది అని తెలిపారు.

తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్‌లు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పోర్ట్ కానుండటం ఎంతో గర్వంగా ఉంది. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ రాష్ట్రానికి భవిష్యత్‌లో ఎంతో సంపద సృష్టించే వనరు కానుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.