mt_logo

ప్రభుత్వ బడులల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారు: కేటీఆర్ ఆగ్రహం

ప్రభుత్వ బడులల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించటంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిలైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కొత్త‌ప‌ల్లి పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంలో కారం లేని ప‌ప్పు వడ్డించార‌ని.. పిల్ల‌లు తినేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో వాళ్లకు గొడ్డు కారం, నూనె పోసి భోజ‌నం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిల్లలకు ఇలాంటి ఆహారం అందిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకపోగా.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ స్కీంను కూడా రద్దు చేయటమేమిటన్నారు. పిల్లలకు బడులల్లో పెడుతున్న భోజనం నాణ్యత విషయంలో సమీక్షించాలని తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కేటీఆర్ కోరారు.