mt_logo

కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం దక్కడం సంతోషం: కేటీఆర్

విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి.. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ కానిస్టేబుల్ యాదయ్యకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఏడు కత్తి పొట్లు పడి.. రక్తం ధారలా కారుతున్నా చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు యాదయ్య చూపించిన తెగువ అసామాన్యం అని కొనియాడారు. 2022లో జరిగిన ఈ ఘటనలో యాదయ్య గారు చేసిన సాహసానికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవం దక్కడం సంతోషకరం అని పేర్కొన్నారు.

సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ పోలీసులు శక్తివంచన లేకుండా ఎలా పని చేశారో తెలపడానికి ఈ ఉదంతం ఒక గొప్ప ఉదాహరణ అని అన్నారు. తన వృత్తి పట్ల, ప్రజల బాగోగుల పట్ల యాదయ్య చూపించిన చిత్తశుద్ధి.. ప్రతి ఉద్యోగికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం అని అభిప్రాయపడ్డారు.