బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి గారు.. మొన్న 30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చారన్నారు. నిన్న కాగ్నిజెంట్ కంపెనీని మీరే తెచ్చామన్నారు. నేడు సీతారామ ప్రాజెక్టును మీరే కట్టారంటున్నారు. మా కష్టాన్ని ఎన్నిసార్లు మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు అని ప్రశ్నించారు.
హద్దుమీరిన అబద్ధాలతో ఎన్నిసార్లు మభ్యపెట్టాలని చూసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి.. లక్ష్యాన్ని చేర్చిన నాడే.. అది వారి సమర్థతకు ప్రతీక అవుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సర్కారు క్రెడిట్‌ను కొట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ ఎంత చేసినా.. నాలుగు కోట్ల ప్రజానీకం మాత్రం నమ్మదు.. తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదు అని దుయ్యబట్టారు