mt_logo

దాడులతో సునీత లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు: కేటీఆర్

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో.. సునీతా లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

ఈ సంఘటన తాలూకు వివరాలను, సునీత లక్ష్మారెడ్డి యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు

ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీత లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎన్ని అరాచకాలకు పాల్పడిన 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని అన్నారు.