mt_logo

గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నాయకుల అరెస్టును ఖండించిన కేటీఆర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలను అధ్యయనం చేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితుల పరిశీలన కోసం బీఆర్ఎస్ నియమించిన అధ్యయన కమిటీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఎమ్మెల్యే డాక్టర్ కే సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌లను గాంధీ హాస్పిటల్ వద్ద అడ్డుకొని పోలీసులు అరెస్టు చేసిన చేశారు.

ఈ అరెస్టును ఖండిస్తూ.. పోలీసులు వారిని వెంటనే విడుదల చేయాలని, ఆసుపత్రులలోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే స్వయంగా డాక్టర్లు అయిన మా నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని పిరికిపంద చర్యలకు పాల్పడిన ప్రజారోగ్య వ్యవస్థ లోపాలను ఎత్తిచూపుతామని స్పష్టం చేశారు.