భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఇక్కడ వనమాను గెలిపిస్తే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అప్పుడు అనేక సంక్షేమ పథకాలను చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ ప్రాంతంలోని పోడు భూముల, అంబ సత్రం భూముల సమస్యలను పరిష్కరిస్తం అని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత సింగరేణి కార్మికులు మరొక సారి తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపిస్తే సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా బీజేపీ మోడీ నుండి కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలియజేసారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనసులను పెద్ద మొత్తంలో ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అని వెల్లడించారు. ఇక్కడ మీరు వనమా వెంకటేశ్వరరావును గెలిపిస్తే అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రాంతాన్ని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తాం అని మంత్రి మాట ఇచ్చారు.