డీప్ ఫేక్..మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నేతలకు సైతం ప్రమాదమే అని మంత్రి కేసీఆర్ హెచ్చరించారు. బేగంపెట్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా “విమెన్ ఆస్క్ కేటీఆర్” ముఖాముఖిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉండటం వల్ల మా నాన్నతో తక్కువ సమయం గడిపేది. మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నాని అన్నారు. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుంది.నా చెల్లి చాలా డైనమిక్ అని వెల్లడించారు. నా కుటుంభంలోనే తనంత ధైర్యవంతులు లేరని చెప్పారు. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కూతురు పుట్టాక నా జీవితం చాలా మారిందని తెలిపారు.
ప్రతి చిన్నారి పై 10వేలకు పైగా ఖర్చు
హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకార్లుల్లో ఎక్కువ మంది మహిళలే.. కోవిడ్ సమయంలో సూచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటివారు గొప్పగా నిలిచారని అన్నారు. మహిళలు మానసికంగా చాలా బలంగా వుంటారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాం అని వెల్లడించారు. మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించాం. ప్రతి చిన్నారి పై 10వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు 61% కి పెరిగాయి. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్
తెలంగాణ, ఏపీలలో మహిళలు స్త్రీ నిధిలోన్‌లను మహిళలు 99 శాతం చెల్లిస్తున్నారు.ఆ లోన్ తో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారని అభివర్ణించారు. మేము మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్నింటిని పూర్తి చేసాము ఇంకా చేయాల్సిన ఉన్నాయి. మహిళా యూనివర్సిటీ, కల్యాణ లక్ష్మి, అమ్మఒడి సేవలు వంటివి తెచ్చాం.. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నామని తెలియజేసారు. సుల్తార్‌పూర్, నందిగామ సహా మొతం 4 చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసాము.. మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్ ఇస్తాం అని హామీ ఇచ్చారు.
సోషల్ మీడియాని వాడుకుని దుష్ప్రచారం
ప్రత్యర్థులు ఫేక్ డీప్ వాడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సి క్‌గా తయారవుతోందన్నారు. మా ప్రతిపక్షాలు మాపై సోషల్ మీడియాని వాడుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నల్సార్‌తో కల్సి సైబర్ క్రైమ్ లేజిస్లేషన్ తయారు చేస్తున్నామని వివరించారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదని సూచించారు. మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నాం అని చెప్పారు. రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు. రావాలి కూడా అని మంత్రి కోరారు.