mt_logo

దరిద్రానికి నేస్తం ‘హస్తం’: అశ్వారావుపేట రోడ్‌షోలో మంత్రి కేటీఆర్

అశ్వారావుపేట: అశ్వారావుపేట రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వరల్డ్ కప్ గెలవడం పక్కా.. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి  అవడం పక్కా..  అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సారథ్యంలో మెచ్చా నాగేశ్వరరావు 25957 ఏకరాలకు పోడు పట్టాలిచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కువ పట్టాలిచ్చింది ఇక్కడే.. అని తెలిపారు. 

అశ్వరావుపేట అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. 80 శాతం గ్రామాల్లో రోడ్లు పూర్తి చేసుకున్నాం అని వెల్లడించారు. ఆయిల్ పామ్ పరిశ్రమ సామర్థ్యం పెంచుకున్నామ్.. అశ్వారావుపేట 30 పకడల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి చేశాం,  48 తండాలను పంచాయతీలుగా చేశాం, దమ్మపేటలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేసుకుంటున్నాం, మెచ్చా ప్రోగ్రెస్ చూడండని సూచించారు. ప్రత్యర్థి పార్టీలపై దృష్టి పెట్టి ఆలోచించండని కోరారు. 

కాంగ్రెస్‌కి 11సార్లు దేశం అవకాశం ఇస్తే చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 2014 ముందు అశ్వారావుపేట పరిస్తితికి ఇప్పటికీ మార్పు మీరే చూడండని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వుందన్నారు. నాడు కనీసం 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు. రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. 10హెచ్.పీ మోటార్లు ఏ రైతుకు వున్నాయి? అని అడిగారు.

కాంగ్రెస్ వాళ్లకి రెండు బస్సులు పెట్టిస్తా, ఏ ఊరికి వెళ్లి వైర్లు పట్టుకున్నా సిద్ధమే..దరిద్రం వదిలిపోతుందని అన్నారు. రైతుల కళ్ళలో కన్నీరు మిగిల్చిన కాంగ్రెస్‌కి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దరిద్రానికి నేస్తం హస్తం. ఎవరి మాయ మాటలు నమ్మొద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ కొత్త సీసాలో పాత సరుకు. వాళ్ల డబ్బు సంచులు భయపడద్దన్నారు. కారు గుర్తుకు ఓటేసి  మెచ్చాని గెలిపించి కేసీఆర్‌ను  ముఖ్యమంత్రిని చేసుకుందాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.