mt_logo

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది: ఎక్స్‌లో కేసీఆర్ పోస్ట్

తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.. ఈరోజు ఎక్స్ (ట్విట్టర్)లో అడుగుపెట్టిన కేసీఆర్.. తన అధికారిక ఖాతాలో రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ కోతల గురించి ప్రస్తావించారు.

నేను గంట క్రితం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది అని పేర్కొన్నారు.

ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు అని తెలిపారు.

రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని కేసీఆర్ అన్నారు.