mt_logo

ఎన్నికల్లో ప్రజలు గెలవడం ముఖ్యం: సీఎం కేసీఆర్

ఎన్నికల్లో వ్యక్తి గెలువడం కంటే ప్రజలు గెలువడం ముఖ్యమని  సీఎం కేసీఆర్ తెలిపారు. మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..  ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏనాడు వ్యక్తిగత పనుల గురించి అడగలేదు. మిర్యాలగూడ అభివృద్ధి పనుల గురించే ఎప్పుడు అడుగుతాడని తెలిపారు. కేసీఆర్ కళాభారతి చక్కగా కట్టారు. ఆ భవనమే భాస్కర రావు మైండ్‌కు దర్పణం పడుతుందని అన్నారు. 
ప్రజాస్వామ్య పరిణతి అంటే ఎన్నికల్లో వ్యక్తుల్నే కాదు ఏ పార్టీ నుంచి నిలబడ్డాడు? ఆ పార్టీల చరిత్ర, వైఖరి, దృక్ఫథం, ప్రజల గురించి ఆ పార్టీ ఆలోచనా సరళి ఏంది? అంతిమంగా ఏం కోరుతున్నరనేది నిర్ణయించి ఓటెయ్యాలె అని సూచించారు. ఎన్నికల్లో వ్యక్తి గెలువడం కంటే ప్రజలు గెలువడం ముఖ్యంమని తెలిపారు.  కృష్ణానదిలో ఈసారి నీళ్లు తక్కువగా వస్తే..శ్రీశైలంలో ఆపుకున్నరు. సాగర్ వరకు నీళ్లు చాలా తక్కువొచ్చినయ్ అని చెప్పారు.  నీళ్ల సమస్యకు శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నది. గోదావరి జలాలను ఆసిఫ్ నగర్ కెనాల్ నుండి నల్గొండ ఉదయ సముద్రానికి, అక్కడి నుంచి పెద్ద చెరువుకు నీళ్లను తీసుకొస్తే శాశ్వతంగా నీళ్ల సమస్య తీరుతుంది.
ఏ ప్రభుత్వం దళితుల గురించి ఆలోచన చేయలే
తరతరాలుగా దళిత జాతి అణిచివేతకు గురవుతావున్నది. వాళ్లు మన సాటి మనుషులు కాదా? ఇంకెన్నాళ్లు దళితులు అలాగే ఉండాలి? దళితులకు ఎమోషన్స్ లేవా? గౌరవం లేదా? వాళ్లకు ప్రేమలు లేవా? ఎందుకింత అత్యాచారం, అన్యాయం జరగాలె? అని ప్రశ్నించారు.   స్వతంత్రం వచ్చిననాడే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన జాతులు, నిమ్న కులాలను గుర్తించి వాళ్ల కోసం గ్రోత్ ఇంజన్ పెట్టుంటే 70 ఏండ్ల కాలంలో దళితులు దరిద్రం తీరకపోవునా? కాంగ్రెసోళ్లు దళితుల గురించి ఆలోచన చేయలే. ఏ ప్రభుత్వం చేయలేదని సూచించారు. 
దళితుల కోసం ‘దళిత బంధు’ అనే పథకాన్ని సృష్టించిందే కేసీఆర్ అని స్పష్టం చేసారు. ఇంటికి పది లక్షల రూపాయలు ఇస్తున్నమని స్పష్టం చేసారు. బడ్జెట్ ఒకేసారి ఇచ్చేందుకు అనుకూలంగా లేకపోవచ్చు. దశలవారీగా అయినా పూర్తి చేస్తామని తెలిపారు. దళితుల కోసం ఇలాంటి నినాదమైనా వస్తే.. వారిలో ఆత్మవిశ్వాసం వస్తుంది. దేశవ్యాప్తంగా బాగుపపడేందుకు ఆస్కారం ఉంటదటదని తెలిపారు.  భాస్కర రావు లాంటి ఉత్తమమైన వ్యక్తిని గెలిపించండి. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్‌ను గెలిపించండని విజ్ఞప్తి  చేసారు.