mt_logo

డీకే శివకుమార్‌ తీరు కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లుంది: సీఎం కేసీఆర్

యాదాద్రి దేవస్థానం తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో చూడాలని ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఆ లక్ష్మి నరసింహుడే మనతో పనులు చేయించుకున్నారన్నారు. మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేసుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేసారు.  సునీత నా బిడ్డ లెక్క ఆమె అడిగిన హామీలు అన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత భూముల ధరలు తగ్గుతాయన్నారు. కానీ ఇప్పుడు భూముల ధరలకు రెక్కలు వచ్చాయని తెలిపారు. కరెంట్ ఉండదు.. చిమ్మని చీకట్లు ఉంటాయన్నారు,  కానీ తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు.

ఇజ్జత్ తీసుకున్నందుకు వచ్చారా ?

కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు. డీకే శివకుమార్ ప్రచారం కోసం వచ్చారా..? ఇజ్జత్ తీసుకున్నందుకు వచ్చారా ? అని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నాడు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెస్తే ససేమిరా అన్నానని గుర్తు చేసారు.  ఒకప్పుడు రైతు కొడుక్కి పిల్లను ఇవ్వకపోయేది. ఇప్పుడు భూమి ఉంటే చాలు పిల్లను ఇస్తామంటున్నారు.

భూములపై  రైతులకే అధికారం ఇచ్చిన బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా?

రైతుబంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నాడు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి ఏం తెలుసు అని విమర్శించారు. ధరణి ఉంటే రైతులు భూములు సేఫ్‌గా ఉన్నట్టని, అలాంటి ధరణిని తీసేసే వ్యక్తులను గెలిపిస్తారా ? భూములపై  రైతులకే అధికారం ఇచ్చిన బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా? ఆలోచించడని పేర్కొన్నారు.