mt_logo

సోషల్ మీడియా వాడుకొని వాస్తవాలు ప్రచారం చేయాలి: బీఆర్ఎస్‌వీ సమావేశంలో కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశానికి  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణ ఎలా మారిందో చూడండని సూచించారు. సోషల్ మీడియా గంటలు గంటలు చూస్తుంటారు మీరు,  కానీ బీజేపీ సోషల్ మీడియాతో ఏదేదో ప్రచారం చేస్తుంటారని అన్నారు. ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చేట్టు మీరు కూడా అదే సోషల్ మీడియా వాడుకొని వాస్తవాలు ప్రచారం చేయాలని తెలిపారు. ఫేస్ బుక్, ఇన్స్ట గ్రాం, యూట్యూబ్‌లను విస్తృతంగా వాడండని సూచించారు. 

గ్రామగ్రామానా అభివృద్ధిని చూపించండి 

కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ అని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్నాయి,  వాటిని తిప్పి కొట్టేలా గ్రామగ్రామానా  జరిగిన అభివృద్ధిని చూపించండని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 10 యేళ్లు ఉన్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని,  వాళ్ళకి 2014 ముందు పరిస్థితులు వాళ్ళకి తెలియదని, వాళ్ళకి తెలియజెప్పాలని అన్నారు. రాజకీయ యుద్ధంలో మనతో పోటీ పడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ సమయంలో యువత, విద్యార్థులను చంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోంది, వందల మంది చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మకండని పేర్కొన్నారు. 

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేయటానికి నాదే బాధ్యత 

పేపర్ లీకేజీ చేసింది బండి సంజయ్ చెంచా గాడు కాదా? అని అడిగారు.  గ్రూప్ 2 రద్దు చేయాలని చెప్పింది బండి సంజయ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కాదా?  రద్దు చేస్తే గొడవ చేసింది వీళ్ళు కాదా? కోర్టులో కేసు వేసి గ్రూప్ 2 రద్దు చేయించారని మంది పడ్డారు. కడుపులో గుద్ది, నోట్లో పిప్పర మెంటు పెడుతారని ఎద్దేవా చేసారు. టీఎస్‌పీఎస్సీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు.  డిసెంబర్ 3 తర్వాత టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేయటానికి నేనే బాధ్యత తీసుకుంటా అని హామీ చ్చారు.  కొన్ని చోట్ల తప్పులు జరిగాయి, అది నేనే ఒప్పుకుంటానన్నారు. 

 మీలాంటి పందుల దగ్గరికి రాము 

అక్కడి రా ఇక్కడి రా అని సవాల్ చేస్తున్నారు,  మేము ఎక్కడికైనా వస్తాం. కానీ మీలాంటి పందుల దగ్గరికి రామని తేల్చి చెప్పారు. ఎవరెవడో వచ్చి డైలాగులు కొడితే పడిపోకండి. ఉద్యమ విద్యార్థి నాయకులకి పదవులు ఇచ్చింది కేసీఆరే స్పష్టం చేసారు.  ఉదర గొట్టే ఉపన్యాసాలు చేసే వారినీ తిప్పి కొట్టాలి. 33 జిల్లాల్లో రాష్ట్ర కమిటీ ఉన్నది రాబోయే 30 రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకులు మనం చేసిన అభివృద్ధి గురించీ చర్చ పెట్టాలన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్‌వీ విద్యార్థి సంఘాల నాయకులు వాటిని తిప్పి కొట్టాలని వెల్లడించారు. 

సంపద పెంచింది కేసీఆర్

పార్లమెంట్‌లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయింది, నిండు పార్లమెంట్ లో ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడుతున్నారు .మొన్న అమిత్ షా వచ్చి ముఖ్యమంత్రి అని ముసలి కన్నీరు కారుస్తున్నారు, ఒకడు కులం అంటాడు, మరొకడు మతం అంటాడు. కులం, మతం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా ఆలోచించాలి. 3,1046 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చింది కేసీఆర్ అని తెలియజేశారు. సంపద పెంచింది కేసీఆర్, 

పచ్చిగా దొరికిన దొంగ వాడు నీతులు చెప్తోండు

మనతో పోటీ పడుతున్నది ఇద్దరు చిల్లర గాళ్లు,  మనకి పోటీ కాంగ్రెస్, బీజేపీ  కాంగ్రెస్ పార్టీకీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓటుకి నోటు దొంగ గాడు, వాడు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మద్యం పంచకుండా ప్రమాణం చేద్దాం అంటున్నాడు. వాడు పచ్చిగా దొరికిన దొంగ వాడు నీతులు చెప్తోండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనీ బ్రతిమిలాడుతున్నారు , ఏం పీకడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగారు. రేవంత్ రెడ్డిని  ఇప్పుడు రేటెంత రెడ్డి అంటున్నారు. వాడికి అధికారం ఇస్తే కోటిలో చారానకి అమ్మేస్తాడు .అందుకే వాళ్ళని నమ్మొద్దు మోసపోవద్దని తెలిపారు.

డీకే వచ్చి పీకేది ఏం లేదు 

ఎన్నో పోరాటాలతో రాష్ట్రం వచ్చిందీ అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మోసపోవద్దు. డీకే శివకుమార్, పైసలు పట్టుకొని వచ్చాడు, డీకే వచ్చి పీకేది ఏం లేదని విమర్శించ్చారు.  24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రానికి వచ్చీ , 5 గంటలు ఇస్తున్నాము అని చెప్తున్నాడు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. గుట్టకు రాళ్ళు మోయద్దు, ఎక్కడ అయితే టప్ ఉంటుందో అక్కడకి వెళ్లి ప్రచారం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.