శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని కేసీఆర్ అన్నారు.
అన్యోన్య దాంపత్యానికి పుణ్యదంపతులైన సీతారాములు ఆదర్శనీయులని కేసీఆర్ తెలిపారు. ఆ సీతారాముల కరుణకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భద్రాద్రి సీతారామచంద్రులను కేసీఆర్ ప్రార్థించారు.