mt_logo

సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటు: కేసీఆర్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు.

సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.

సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.