- రైతన్నలకు రైతు బంధు మాత్రమే ఆపాలా??
- పేదింటికి రేషన్ బియ్యం.
- ముసలవ్వలకు ఆసరా పెన్షన్..
- అక్కలకు బీడీ పెన్షన్..
- ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు..
- ఇండ్లకి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు..
- -మీడియాతో ఎమ్మెల్సీ కవిత
ఈ ఎలక్షన్స్‌లో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో మీడియాతో కవిత మాట్లాడుతూ.. ఈ ఎలక్షన్‌లో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు అని అన్నారు. రైతన్నలకు రైతు బంధు మాత్రమే ఆపలా?? అని అడిగారు. పేదింటికి రేషన్ బియ్యం, ముసలవ్వలకు ఆసరా పెన్షన్.. అక్కలకు బీడీ పెన్షన్, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు.. ఇండ్లకి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు..షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలా అన్ని ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆపే కుట్రను కూడా చేస్తుందా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాన్నారు. నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టే నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజకీయ సుస్థిరత సాధించిందని స్పష్టం చేశారు. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటదని సూచించారు.
బెంగళూర్‌ని ఐటీ లో క్రాస్ చేశామ, ఐటీ హబ్‌లు వచ్చాయని తెలిపారు. ఇండస్ట్రియల్ జోన్స్ కూడా వస్తాయని అన్నారు. తెలంగాణను పట్టణీకరణ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తే వాళ్ళ అభద్రతా భావం కనిపిస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆఫీసర్లను మార్చాలని , రైతు బంధు , దళిత బందు ఆపాలని కాంగ్రెస్ అంటుందని ఫైర్ అయ్యారు. అలా అయితే కాంగ్రెస్ వాళ్ల ఇళ్లకు కరెంట్ ఆపాలని సూచించారు.
తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్ వచ్చింది కదా? అని అడిగారు. బీజేపీలాగ పేర్లు మార్చి పథకాలు పెట్టడం లేదన్నారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అనే కాంగ్రెస్ హామీ .. ఎన్నికల హామీ మాత్రమే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గాంధీలకే గ్యారంటీ లేదు .. అధ్యక్షుడు లేకుండా హామీ ఇస్తారు? అవి ఎలా? నమ్మాలన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. 2010లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీలను చేర్చకుండా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. అరవింద్‌ను కోరుట్లలో ఓడిస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. రేవంత్ కామారెడ్డికి వచ్చిన, ఈటెల గజ్వెల్‌లో పోటీ చేసిన మా పార్టీకి వచ్చిన నష్టం లేదన్నారు.