mt_logo

‘కేసీఆర్ భరోసా’ పేరుతో మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోనున్న బీఆర్ఎస్

‘కేసీఆర్‌ భరోసా’ కొత్త కార్యకమాన్ని, ప్రారంభించనున్నట్లు బుధవారం నాడు మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన 16 హామీలను అర్థమయ్యేలా వివరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే, నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజుల పాటు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహింస్తున్నారు. 19 నుంచి 25 వరకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలకు విరామం ప్రకటించారని తెలిసిన విషయమే. అయితే ముంద విడుదల చేసిన షెడ్యూల్‌లో కొన్ని మార్పులతో మరో షెడ్యూల్‌ విడుదల చేసారు. దాని ప్రకారమే శుక్రవారం పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.