-సీఎం కేసీఆర్ సంకల్పంతో వరదకాలువకు ప్రాణం
-నీళ్లను ఎదురెక్కించి శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం
అది వరద కాలువ.. ప్రాజెక్టులో నీళ్లుంటేనే పారే జల వనరు. కానీ ఇప్పుడది ఎదురెక్కుతున్నది. 122 కిలోమీటర్ల పొడవునా రిజర్వాయర్లుగా మారి సీఎం కేసీఆర్ జల ఆశయాన్ని నెరవేరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో దిగువకు నీళ్లు ఇవ్వాల్సిన ఆ కాలువ ఇప్పుడు ఎగువకు ఎదురుక్కి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్జీవం తీసుకొస్తున్నది. కేసీఆర్ ప్లాన్ చేస్తే ఎడారిని తలిపించే కాలువైనా సజీవధారగా మారుతుందనేందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. కాలమేదైనా.. కాలం కాకున్నా అన్నదాత నాగళ్లకు పనిచెప్పేందుకు.. వర్షాభావ పరిస్థితుల్లోనూ భూములను తడిపేందుకు వడివడిగా అటు శ్రీరాంసాగరానికి.. మధ్య మానేరు జలాశయానికి పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అద్దంపడుతున్నది.
వరద కాలువ విశేషాలివే..
-నాటి ప్రధాని నెహ్రూ 1963 జూలై 26న పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
-112 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించిన ఈ ప్రాజెక్టును 1970 జూలై 24న అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
-1978లో పోచంపాడు పేరును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా అప్పటి సీఎం మార్చా రు.
-శ్రీరాంసాగర్ స్టేజీ-1 కింద 9,68,640 ఎకరాలు, స్టేజీ- 2 కింద 3,97,949 ఎకరా లు మొత్తంగా 13,55,589 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆనాటి పాలకులు ప్రణాళిక రూపొందించారు.
– ప్రాజెక్టుకు భారీగా వరదొలిచ్చినప్పడు ఆ నీరంతా సముద్రం పాలయ్యేది. దీంతో ఆ నీరును దిగువకు ఇవ్వాలన్న లక్ష్యంతో 1991లో ఆనాటి ప్రధాని పీవీ నర్సింహరావు వరదకాలువకు శంకుస్థాపన చేశారు.
-ఈ కాలువ ద్వారా దిగువకు 20 టీంఎసీల నీటిని తరలించి.. 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆనాడు నిర్ణయించారు.
-కానీ ఆరంభం నుంచి చివరి వరకు వరదకాలువ పనుల విషయంలో నాటి పాలకులు నిర్లక్ష్యం చూపారు.
-దీంతో 122 కిలోమీటర్ల పొడవు కాలువ తవ్వడానికి 19 ఏండ్లు పట్టింది.
-1991లో పనులు ప్రారంభం కాగా, 2010 నుంచి కాలువ అందుబాటులోకి వచ్చింది.
– అయితే, కాలువ నుంచి వచ్చే నీటిని ఒడిసి పట్టుకొనేందుకు అనుగుణంగా దిగువ డ్యాంలు కట్టి వాటిలో నీళ్లు స్టోరేజీ చేసుకోవాలని సమైక్య పాలకులు ఆలోచించలేదు.
– మేధావులంతా ఈ విషయంలో విమర్శలు చేయడంతో ఆనాటి ప్రభుత్వం చివరకు 2005-06లో మానేరుపై శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని ప్రారంభించింది.
-నిబంధనల ప్రకారం 2009 నాటికి దీన్ని పూర్తిచేయాలి. కానీ, 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయింది.
-తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా నిధులు కేటాయించి.. రెండేళ్లలోనే శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని పూర్తి చేసింది.
– వదరకాలువ ఎడారిలా మారిపోయిందని యావత్తు రైతాంగం నిరాశలో కూరుకుపోయిన తరుణంలో
సీఎం కేసీఆర్‌ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు శ్రీకారం చుట్టారు.
-అందులో భాగంగానే కాళేశ్వరం జలాలను ఎత్తి వరద కాలువద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపేందుకు శ్రీరాంసాగర్ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు.
-1,999.56 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
-పునర్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం నీటిని గాయత్రి పంపుహౌస్ నుంచి ఎత్తిపోసే నీరు వరదకాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తాయి. ఇక్కడి నుంచి శ్రీరాంసాగర్‌ప్రాజెక్టుకు అంటే ఎగువకు వెళ్లేందుకు.. వరద కాలువ 102 కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులరేటరీ గేట్లు ఏర్పాటు చేశారు. వరదకాలువ 102 కిలోమీటర్ నుంచి ఎగువన 73 కిలోమీటర్‌వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్ పంపుహౌస్ గేటు వరకు అర టీఎంసీ నీరు వరద కాలువ లో నిల్వ ఉంటుంది.
-అక్కడి నుంచి 34 కిలోమీటర్ వద్ద ఏర్పాటుచేసిన రాజేశ్వర్‌రావు పేట పంపుహౌస్ వరకు మరో అర టీఎంసీ, తిరిగి అక్కడి నుంచి 0.10 కిలోమీటర్ ముప్కాల్ వద్ద ఏర్పాటు చేసిన పంపుహౌస్ వరకు ఇంకో అరటీఎంసీ నీరు నిల్వ ఉంది. వీటితోపాటు 102 కిలోమీటర్ నుంచి దిగువకు అంటే శ్రీరాజరాజేశ్వరజలాశయం (మధ్యమానేరు)లో కలిసే 122 కిలోమీటర్ వరకు మరో అర టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. మొత్తంగా వదరకాలువను నిశితంగా పరిశీలించి చూస్తే.. ప్రస్తుతం నాలుగు రిజర్వాయర్లు గా మారి.. దాదాపు రెండు టీఎంసీల నీటిని తన ఒడిలో నింపుకొని ఆ పై నీటిని శ్రీరాంసాగర్‌ప్రాజెక్టులోకి పంపిస్తున్నది.
-వరదకు మాత్రమే వినియోగించేలా సమైక్య పాలకులు కాలువను నిర్మిస్తే.. అదే వరద కాలువను సీఎం కేసీఆర్ తన విజన్‌తో సజీవ జలధారగా మార్చి తెలంగాణ తల్లి ఎదపై జలదృశ్యాన్ని ఆవిష్కరించారు.