mt_logo

నవంబర్ 30న కేసీఆర్ బాల్ కొట్టాలి అది సిక్స్ పోవాలి అదే మా లక్ష్యం: మంత్రి కేటీఆర్

నవంబర్ 30న కేసీఆర్ బాల్ కొట్టాలి అది సిక్స్ పోవాలి అదే మా ప్రథమ లక్ష్యం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ పలు అంశాలపై ముచ్చటించారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీమ్‌కాదని మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు.ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసి పారిపోయాడని ఎద్దేవా చేసారు. అంబర్‌పేట్ నుండి పోటీ చేస్తా అని భయపడి వెళ్ళిపోయాడు.. అధ్యక్షుడే అస్త్ర సన్యాసం చేసాకా సైన్యాధి పతే పక్కకు పోయినాక ఇక సైన్యం ఏం కొట్లాడతాదని అడిగారు. మనిషికి అధికారం శాశ్వతం కాదు, కానీ మాకన్నా ఎవరైనా మెరుగైన అభివృద్ధి కలిగిస్తే మేం కచ్చితంగా మా ఓటమిని ఒప్పుకుంటాం అప్పుడే మా గ్రాఫ్ తగ్గిందని ఒప్పుకుంటాం అని స్పష్టం చేసారు. 

దేశంలోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో యువతను తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో ఉన్నది బీజేపీనేనని తేలిందని, చివరికి.. పదో తరగతి ప్రశ్నపత్రాలను కూడా లీకేజీ చేసింది బండి సంజయ్‌ అని ధ్వజమెత్తారు. గ్రూప్‌-2 పరీక్షను రద్దు చేయాలని బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ డిమాండ్‌ చేసి, ఇప్పుడు ఒక అమ్మాయి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం గ్రూప్‌-2ను రద్దు చేయడం వల్లేనని అంటున్నారు అది వారి విజ్ఞతకే వదిలాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.