mt_logo

సూట్‌కేసులతో గోల్‌మాల్ చేసే వాళ్ళను ప్రజలు గోల్‌మాల్ చేయాలి: సీఎం కేసీఆర్ 

సూట్‌కేసులతో గోల్‌మాల్ చేసే గోవిందం గాళ్ళను ప్రజలు గోల్‌మాల్ చేయాలని సీఎం కేసీఆర్  సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్ధన్ , కాంగ్రెస్ నాయకులు రాజా రమేష్ , వైఎస్ఆర్‌టీపీ చెన్నూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌ దుర్గం నగేష్, బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పత్తి శీను.. బీఆర్ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. మంద‌మ‌ర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం మాట్లాడుతూ… మీ ఓటు త‌ల‌రాత మారుస్తుంది.. ఐదేండ్ల భ‌విష్య‌త్‌ను కూడా నిర్ణ‌యిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాబ‌ట్టి ఆషామాషీగా, అల‌వోక‌గా, డ‌బ్బులు ఇచ్చార‌ని ఓటు వేయొద్దని హెచ్చరించారు. ఆలోచించి ఓటు వేయాల‌ని కోరారు.

ఎన్నిక‌లు రాగానే ఆరోప‌ణ‌లు, డ‌బ్బు సంచులు

బాల్క సుమన్ నాబిడ్డ లాంటివాడు.. నా ఇంట్లో ఉంటాడు.. పార్టీలు మార్చే సూటికేసువాళ్లు కావాలా? సుమన్ కావాలా నిర్ణయించుకోవాలి.. భారతదేశంలో పొలికేక దళిత బంధు.. ప్రతీ కుటుంబానికి దళిత బంధు అందించే వరకు బీఆర్ఎస్ ఊరు కోదు-చెన్నూరు సభలో సీఎం కేసీఆర్‌పార్టీలు మార్చే సూటికేసువాళ్లు కావాలా? సుమన్ కావాలా నిర్ణయించుకోవాలని తెలిపారు.  భారతదేశంలో పొలికేక దళిత బంధు.. ప్రతీ కుటుంబానికి దళిత బంధు అందించే వరకు బీఆర్ఎస్ ఊరు కోదని వెల్లడించారు.  చెన్నూరు చైత‌న్యం ఉండే ఏరియా.. ఉద్య‌మాలు జ‌రిగిన నేల‌.అంద‌రూ ఆలోచించాలి. అభివృద్ధి చెంది బాగా దూసుకుపోతున్న దేశాల‌కు, మ‌న దేశానికి చాలా తేడా ఉంది. ఎన్నిక‌లు రాగానే ఆరోప‌ణ‌లు, డ‌బ్బు సంచులు చూస్తున్నాం. చాలా దేశాలు ఏవైతే ప‌రిణితి సాధించాయో, ప్ర‌జ‌లు విచ‌క్ష‌ణ‌తో ఓటేశారో..  ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అని తెలిపారు.

బీఆర్ఎస్ చ‌రిత్ర మీ కండ్ల ముందే 

కాంగ్రెస్ నుంచి ఒకాయ‌న వ‌చ్చిండు. అర్జెంట్‌గా కండువా మార్చిండు. అట్ల‌నే బీజేపీకి ఒక‌రు ఉంటారు. అభ్య‌ర్థుల గురించి ఆలోచించాలి. ప్ర‌జ‌ల‌కు కోసం ఎంత పాటుప‌డుతాడ‌ని విచారించాలి. దాని కంటే ముఖ్య‌మైందని పేర్కొన్నారు. త‌మాషా కోసం ఓట్లు వేస్తే మ‌న బ‌తుకు కూడా ఆషామాషీ అయిత‌ది అని అన్నారు. ఈ దేశంలో ఒక పార్టీకి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. బీఆర్ఎస్ చ‌రిత్ర మీ కండ్ల ముందు ఉంది.నూరేండ్ల కింద బీఆర్ఎస్ పుట్ట‌లేదు. రాష్ట్రం సాధించేందుకు పుట్టింది. బీఆర్ఎస్‌కు బాస్ ఢిల్లీలో ఉండ‌రు. మాకు బాసులు తెలంగాణ ప్ర‌జ‌లే. మాకు వేరే బాస్‌లు ఉండ‌రు.

కాంగ్రెస్ 18% బోనస్, బీఆర్ఎస్ 36% బోనస్

కాంగ్రెస్ ఏం చేసిందో.. బీఆర్ఎస్ ఏం చేసిందో మీకు తెలుసు అన్నారు. ఏ ప్రభుత్వం ఉంటే మన భవిష్యత్తు బాగుపడుతుందనేది ఆలోచించాలని సూచించారు. అచ్చంగా తెలంగాణ కంపెనీ అయిన సింగరేణిని, నడప చేతకాక కాంగ్రెస్ పార్టీ నేతలే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా కేటాయించారని అన్నారు. 2014లో సింగరేణికి రూ.414 కోట్ల లాభాలుంటే.. నేడు రూ.2184 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. దసరా దీపావళి బోనస్ రూ.1000 కోట్లు పంచుతున్నామని, కాంగ్రెస్ గతంలో లాభాల్లో 18% బోనస్ ఇస్తే, తాము ఇప్పుడు 36% బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి ప్రైవటైజేషన్ పిచ్చి పట్టిందని  సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణిని కూడా ప్రైవటైజేషన్ చేస్తామని అంటున్నారని, అలా చేస్తామంటేనే బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు చేసి అడ్డుకున్నారని తెలిపారు. 49% వాటా కేటాయించిన కాంగ్రెస్‌కు, ప్రైవటైజేషన్ చేస్తామంటున్న బీజేపీకి ఓటేస్తే మీరే ఇబ్బందుల పాలవుతారని పేర్కొన్నారు.

సింగరేణిలో 10 బిలియన్ల టన్నుల బొగ్గు తెలంగాణలో.. 

ఎన్నికలు రాగానే మూడు నాలుగు పార్టీలు మారి సూట్‌కేసులు పట్టుకొని ప్రతిపక్ష నాయకులు వస్తారని హెచ్చరించారు. ప్రజలు దుఃఖం వచ్చినప్పుడు పరామర్శించని వారు, ఎన్నికలు రాగానే కడుపులో పేగు తెంచి కొట్టినట్లు వస్తారని విమర్శించారు. సూట్‌కేసులతో గోల్‌మాల్ చేసే గోవిందం గాళ్ళను ప్రజలు గోల్‌మాల్ చేయాలన్నారు. సింగరేణిలో 10 బిలియన్ల టన్నుల బొగ్గు తెలంగాణలో ఉందని తెలిపారు.  కాబట్టి ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మకూడదని సూచించారు.