mt_logo

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ లో హైదరాబాద్ నంబర్ వన్

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ లో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఆఫీసు లీజ్ కోసం వివిధ రంగాల సంస్థ‌లు పోటీ ప‌డుతున్న మూడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ఒక‌టని… 2022 ద్వితీయ త్రైమాసికంలో హైద‌రాబాద్‌లో 2.6 మిలియ‌న్ల స్క్వేర్‌ఫీట్ల ఆఫీస్ స్పేస్ కోసం లీజ్ అగ్రిమెంట్లు కుదిరాయ‌ని అగ్ర‌శ్రేణి రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ నివేదించింది. దేశ‌వ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ అగ్రిమెంట్లు తొలి త్రైమాసికంతో పోలిస్తే 61 శాతం పెరిగి, 18.2 మిలియ‌న్ల చ‌ద‌ర‌పు అడుగుల‌కు చేరుకోగా… ఆఫీస్‌స్పేస్ లీజింగ్ అగ్రిమెంట్ల‌లో ఇదే గ‌రిష్ఠం అని సీబీఆర్ఈ వివ‌రించింది. లీజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న సంస్థ‌ల్లో ఇంజినీరింగ్‌, మాన్యుఫాక్చ‌రింగ్ సంస్థ‌ల వాటా 53 శాతం అయితే, లైఫ్ సైన్సెస్ సంస్థ‌ల వాటా 16 శాతం, బ్యాంకింగ్‌- ఫైనాన్స్ స‌ర్వీసెస్‌- ఇన్సూరెన్స్ సంస్థ‌ల వాటా 15 శాతం. హైద‌రాబాద్‌లో కామ్మ‌ర్ జోన్ వింగ్ వ‌న్‌లో క్వాల్‌కామ్ 1.1 మిలియ‌న్ల చ‌ద‌ర‌పు అడుగుల స్పేస్ కోసం లీజ్ కుదుర్చుకున్న‌ది. మై హోం ట్విట్జాలో పీడ‌బ్ల్యూసీ 0.35 మిలియ‌న్ల చ‌ద‌ర‌పు అడుగులు, ఏవ్యాన్స్ బిజినెస్ హ‌బ్ (హెచ్‌9)లో లెగాటో 0.33 మిలియన్ల చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం లీజ్ కుదుర్చుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *