వెల్గొండ స్టేజి వద్ద ద్విచక్ర వాహనా ఢీ కొట్టిన కారు. గాయపడిన బాధితున్ని తన పోలీస్ వాహనంలో ఆసుపత్రికి పంపించిన మంత్రి.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టగా గాయపడిన వ్యక్తిని తన కాన్వాయి వాహనంలో ఆసుపత్రికి పంపించి మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వం చాటుకున్నారు.
గంగాపూర్ గ్రామానికి చెందిన రేంటం రాజమల్లు వెల్గొండలోని తన కొడుకు ఇంటి వద్దకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు.ఈ క్రమంలో ధర్మపురి నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో గాయాలపాలు ఆయి అక్కడే పడి ఉండగా అదే సమయంలో వెల్గొండ వైపు వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ తన కాన్వాయ్ ని ఆపి గాయపడిన రాజమల్లును తన కాన్వాయి పోలీసు వాహనంలో ఆసుపత్రికి పంపించి ఖర్చుల నిమిత్తం రూ. 2 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.