mt_logo

కాంగ్రెస్‌ను తెలంగాణలో బతకనీయొద్దంటూ ఫ్లెక్సీలు

శుక్రవారం రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి బ్యానర్‌ల కలకలం రేగింది. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను తెలంగాణలో బతకనియద్దు అంటూ తెలంగాణ అమరవీరుల ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిసాయి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆ పార్టీపై ఆగ్రహంతో తెలంగాణ ప్రజలు ఇలా ఫ్లెక్సీల రూపంలో వారి సందేశాన్ని తెలిపినట్టు తెలుస్తోంది. మొన్న మాజీ కేంద్ర మంత్రి  చిదంబరం అమరులను అవమానకర మాటలతో కించపరిచేలా మాట్లాడిన నేపథ్యంలో  కాంగ్రెస్ పై తెలంగాణ సమాజం మండిపడుతున్నారు.