ఈద్-ఉల్-ఫితర్ (పవిత్ర రంజాన్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు .పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో ఒకటి రంజాన్ అని కొనియాడారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు.ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని అన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. కుల మతాలకతీతంగా ఒకరి పండుగలను మరొకరు సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకునే సంస్కృతి మన తెలంగాణ వారిదిన్నారు.
ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.