బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు చేసిన కామెంట్స్‌కి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారు.. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్రపట్టడం లేదు అని పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు సిగ్గు ఉందా.. రాహుల్ గాంధీ ఏమో తన మ్యానిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని పెడతారు.. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి తీసుకుంటాం అని అంటున్నారు అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల త్వరత మళ్ళీ అధికారంలోకి రాదు.. అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచిన కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు ఆని హరీష్ అన్నారు.
మీరు ఎన్ని చేస్తారో చేయండి కానీ గుర్తు పెట్టుకొండి.. మేము వడ్డీతో సహా మీకు తిరిగిస్తాము.. మీరు ఎన్నిచేసిన ఇచ్చిన హామీలు అమలు చేసేదాక మిమ్మల్ని వదిలిపెట్టం.. మీ వెంట పడుతాం అని హెచ్చరించారు.