ఈరోజు అరెస్టయిన మాజీ సర్పంచ్‌లను తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం కనిపిస్తుంది. సర్పంచులు ఏం తప్పు చేశారు.. ప్రజలకు సేవ చేయటమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
సర్పంచులు వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారు..8 పైసలు కూడా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. ఢిల్లీ ఇచ్చిన రూ. 500 కోట్లు కూడా విడుదల చేయలేదు అని అన్నారు
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించింది.. జ్వరాలతో జనం బాధపడుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది.. ప్రతి నెల రూ. 275 కోట్లు మేము మా ప్రభుత్వంలో ఇచ్చాం. పల్లె ప్రగతి డబ్బులు ఇవ్వటం లేదు అని విమర్శించారు.
ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పథకం నుంచి వచ్చిన డబ్బులు ఈ ప్రభుత్వం దాచిపెట్టింది. తమ పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా ఈ ప్రభుత్వం అరెస్టు చేసింది అని హరేష్ రావు మండిపడ్డారు.