స్పోర్ట్స్ పాలసీపై చర్చతో పాటు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టే అంశంపై శాసససభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. స్పోర్ట్స్ పాలసీ ప్రభుత్వం తెస్తామని అంది.. దానికి మా సూచనలు, సలహాలు కూడా ఇస్తాం అని తెలిపారు.
తెలంగాణలోని ప్రతి గ్రామంలో మేము గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాం. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను బాగు చేసి వాటిని కూడా మెయింటెన్ చేయండి అని కోరారు.
సురవరం ప్రతాప్ రెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎనలేని గౌరవం ఉంది. ఆయన పేరు మీద తెలుగు విశ్వ విద్యాలయం పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 10 ఏళ్ల పాటు విభజన జరగకపోవటంతో చేయలేకపోయాం.. మీరు చేయండి.. మేము మద్దతు ఇస్తాం.. సురవరం ప్రతాప్ రెడ్డి గారి మీద గౌరవంతో 394 మంది కవులతో గొల్కొండ కవుల సంచిక కూడా తెచ్చాం అని గుర్తు చేశారు.
వెంకటస్వామి గారి విగ్రహం పెట్టాం, ఈశ్వరీ భాయ్ గారి జయంతిని నిర్వహించాం. కాళోజీ గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు గారి పేరు వెటర్నరీ యూనివర్సిటీ పెట్టాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. జగ్జీవన్‌రాం గారి పేరు మీద సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల పెట్టుకున్నాం..5 కోట్లతో దేశోద్దారక భవనంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఆడిటోరియాన్ని బాగు చేశాం ఆని పేర్కొన్నారు.
తెలంగాణలో మహానుభవులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి ఉంది. మీరు కూడా కొనసాగించండి.. మేము మీకు సహకరిస్తాం అని కేటీఆర్ సభాముఖంగా తెలిపారు.