రేవంత్ రెడ్డి చేసేది చిట్‌చాట్ కాదు.. చీట్ చాట్. రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారు అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో చిట్‌చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను ఆదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మేము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారు. అబద్ధాలను, గోబెల్స్‌ను ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు.
రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ. వంద శాతం రుణమాఫీ చేస్తామని మోసం చేశావు. కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు రుణమాఫీ జరగలేదని అంటున్నారు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారు అని అన్నారు.
రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్పారు.. ఆగస్టు 15 లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు.. నేను విసిరిన ఛాలెంజ్ అదే అని తెలిపారు
50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేను ఎయిర్‌పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని సీఎం స్వంత గ్రామంలో రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి తీసుకువెళ్తా అని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేద వరంగల్ సభకు రాహుల్ గాంధీని మూడు సార్లు రేవంత్ రెడ్డి పిలిచినా రావడం లేదు అని ఎద్దేవా చేశారు.
వాల్మీకి స్కాం పట్టపగలు నిలువు దోపిడీ. ప్రభుత్వ డబ్బుతో కార్లు, బంగారం కొన్నారు. తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల అకౌంట్స్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి.. వాల్మీకి స్కాంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు.
వాల్మీకి స్కాం డబ్బులు ఎవరికి వచ్చాయో నేను, రేవంత్ రెడ్డి వెళ్లి ఈడీ విచారణకు కోరుతాము దానికి రేవంత్ రెడ్డి సిద్ధమా? వాల్మీకీ స్కాంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి. వాల్మీకి స్కాంపై తెలంగాణలో ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదు. వాల్మీకి స్కాంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు. వాల్మీకి స్కాంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు. వాల్మీకి స్కాంపై ఈడీ విచారణ చేయాలని బీఆర్ఎస్ తరపున ఈడీని కలుస్తాము అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూల్చివేతల సర్కార్.. హైదరాబాద్ బ్రాండ్‌ను కూల్చివేశారు.. కేసీఆర్ కిట్, రైతుబంధును కూల్చివేశారు.. ఎమ్మెల్యేల ఫిరాయింపుతో ప్రజాస్వామ్యాన్ని కూల్చారు.. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను కూల్చారు.. దేవుళ్ళపై ఒట్టు వేసి ప్రజల విశ్వాసాలను కూల్చారు.. గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చారు అని హరీష్ రావు దుయ్యబట్టారు.
హైడ్రా ఆఫీసు బుద్ధ భవన్ నాలా కింద ఉంది దాన్ని కూలగొడతారా. రంగనాధ్ తన ఆఫీసును కూలగొట్టుకుని ఇతర బిల్డింగులు కూలగొట్టాలి.. జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా కింద ఉంది.. దాన్ని కూలగొడతారా? నెక్లెస్ రోడ్ పక్కన ఉన్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలను కూలగొడతారా.. మీరాలం, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లో పెద్ద, పెద్ద టవర్లు వచ్చాయి అని అన్నారు.
పొంగులేటి ఇంట్లో నీళ్లు చెరువులోకి వెళ్తున్నాయా.. ఎక్కడికి వెళ్తున్నాయి. పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్‌గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందా? అని అడిగారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి శంఖుస్థాపన చేస్తే మంత్రులు ఎవరు రాలేదుతెలంగాణ తల్లికి రూపం ఇచ్చింది కేసీఆర్.. కేసీఆర్ ఆనవాళ్ళపై రేవంత్ రెడ్డి నిలబడ్డారు అని అన్నారు.
సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం.. వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది అని వ్యాఖ్యానించారు.
కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది. ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా అని మండిపడ్డారు.
ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతాను. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9 లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారు.. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895 లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరు మీద భూములు కొంటున్నారు అని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గింది.. రేవంత్ రెడ్డి దగ్గరుండి డీకే అరుణను గెలిపించారు. మోడీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారు అని హరీష్ రావు ఆరోపించారు.
హైడ్రా విషయంలో అందరికీ ఒకటే రూల్ ఉండాలి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి,గుత్తా అమిత్ రెడ్డిని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి.. రాహుల్ గాంధీ ఆదానీ వద్దు అంటే రేవంత్ రెడ్డి అదానీ కావాలని అంటున్నారు. రుణమాఫీపై మేము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు అని అడిగారు.