mt_logo

ఉద్యోగుల విభజన నూతన జోనల్ ప్రకారమే : కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ తెలియజేసారు. వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. భార్యాభర్తలిద్ద‌రూ ఉద్యోగులు అయితే (స్పౌస్ కేస్) ఒకే చోట విధులు నిర్వ‌ర్తిస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని సీఎం పేర్కొన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *