తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్బంగా తెలంగాణ కీర్తి అజరామరం అని జనసేన అధినేత (సినీ ప్రముఖుడు) పవన్ కల్యాణ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి 22 వరకు సాగే దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకం అన్నారు. ఎందరో యోధుల ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఆవిర్భవించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిస్తున్నాను, తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నానని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.