రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరామ్ కర్రి హల్‌చల్ చేస్తున్నాడు. గతంలో శ్రీరామ్ కర్రిని సీఎం తనతో పాటు దావోస్ పర్యటనకు కూడా తీసుకెళ్ళడం పెద్ద వివాదాస్పదం అయ్యింది.
ముఖ్యమంత్రి అధికారిక పర్యటన మీడియా బాధ్యతలు ప్రైవేట్ పత్రిక ఎడిటర్ చూడడం పట్ల సీఎంవో అధికారులు కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల వ్యవహారాలు చూసేందుకు తెలంగాణ బిడ్డలు సీపీఆర్వో, పీఆర్వోలుగా ఉండగా.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ కర్రి అనే వ్యక్తి అతి జోక్యంపై తెలంగాణ జర్నలిస్టులు కూడా కోపంగా ఉన్నట్లు పెద్ద చర్చ నడుస్తుంది.
గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను అనరాని మాటలు అన్న శ్రీరాం కర్రిని విదేశీ పర్యటనలకు ఎలా తీసుకెళ్తున్నారు అని ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాము అని తమ సన్నిహితుల వద్ద కాంగ్రెస్ మీడియా ప్యానలిస్టులు వాపోయారు.
గతంలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి దగ్గర పీఆర్వోగా పని చేసిన ఈ వ్యక్తి, ఆ తరువాత.. బండి సంజయ్ కోసం అన్అఫీషియల్‌గా లైజనింగ్ చేసిన వ్యక్తి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి వెంట చేరడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ కర్రి తీరుపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు పలు ఫిర్యాదులు కూడా చేరాయి.