mt_logo

విద్యుత్ శ్వేత పత్రంతో మరోసారి కాంగ్రెస్ ఇజ్జత్ ఖరాబ్

నిన్న తెలంగాణ అప్పుల మీద శ్వేత పత్రం అంటూ ఒక తప్పుల తడక రిపోర్ట్ ప్రవేశపెట్టి హరీష్ రావు, అక్బరుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నలకు తెల్ల మొహం వేసి అభాసుపాలైన కాంగ్రెస్ సర్కార్ ఇవ్వాళ విద్యుత్ శ్వేత పత్రం అంటూ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకుంది.

గత తొమ్మిదేళ్లలో తెలంగాణ విద్యుత్ రంగంలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ప్రగతి సాధించినట్టు ఏకంగా కాంగ్రెస్ ఇచ్చిన శ్వేత పత్రం లోని అంకెలు రుజువు చేశాయి. స్థాపిత విద్యుత్ సామర్ధ్యం నుండి తలసరి విద్యుత్ వినియోగం వరకు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి మొదలు వ్యవసాయ విద్యుత్ వరకూ అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతి జరిగినట్టు కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రంలో ఇచ్చిన అంకెల సాక్షిగా రుజువైంది.

దీంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారు. ఇందులో నుండి బయటపడటానికి తెలంగాణ ఛత్తీస్గడ్ నుండి కొన్న విద్యుత్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ వేస్తామని ప్రకటించారు. 

నిజానికి తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొన్నది ఛత్తీస్ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి. దీన్ని గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం (జి టు జి) అంటారు. ఇందులో డైరెక్ట్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుండి మరో రాష్ట్ర ప్రభుత్వానికి పేమెంట్ జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ డబ్బు చేరదు కాబట్టి అవినీతి జరిగే ఆస్కారమే లేదు.

కానీ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఈ ఒప్పందం మీద విచారణకు ఆదేశించింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే 2018 నుండి 2023 వరకూ ఛత్తీస్ఘడ్ లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కాంగ్రెస్ శ్వేత పత్రాలు నెల రోజుల లోపలే కాంగ్రెస్ ఇజ్జత్ మొత్తం తీస్తున్నాయి.