mt_logo

నయవంచక కాంగ్రెస్ నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసింది: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డికు యువతపై ప్రేమ లేదు.. నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా.. తెల్ల దొరల పాలన కన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా.. ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన. ప్రచారంలో ఒక మాట.. ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న
సీఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో.. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని కేటీఆర్ అన్నారు.