తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని నిర్ణయం, 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో సంబరాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల, ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం, విధివిధానాలు రూపొందించే బాధ్యత అప్పగించారు, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ప్లాన్, 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం చేసారు, 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం గారు నిలబెట్టుకున్నారు.
HMDA భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి.హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు, వీటితో పాటు మూసిని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖలో రి ఆర్గనైజిగ్ , 33 జిల్లాలో DMHO పోస్టుల శాంక్షన్ చేశారు. హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా GHMC 6 జోన్లకు అనుగుణంగా 6 DMHO లు, రాష్ట్రంలో మొత్తం 38 DMHO పని చేస్తారు. 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ PHC లలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్ గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ,
వడగళ్ల వాన వల్ల ఎంతో నష్ట పోయాం, పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక చేసారు. నాడు 10 జిల్లాలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే. నేడు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అంటే, దానికి సీఎం కేసీఆర్ నిర్ణయాలు కారణం. అకాల వర్షాల వల్ల నష్టపోవడం వద్దు అని నెల ముందు పంట జరపాలని యోచన. ఎలా ముందుకు తేవాలి అనే దానిపై సబ్ కమిటీ నివేదిక ఇస్తుంది. నకిలీ విత్తనాలు విషయంలో సీరియస్, కటినంగా వ్యవహరించాలని నిర్ణయం. ఎలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని, అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు చేసారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, ఒక్క రైతు కూడా మోసపోవద్దు. దీనిపై కూడా సబ్ కమిటీ పని చేస్తుందన్నారు. మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం, అచ్చం పేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం, VRA లు అందరూ రెగ్యులారైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విధివిధానాలు ఖరారు చేయాలని ccla నవీన్ మిట్టల్ కు ఆదేశాలు చేసారు.రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం, వనపర్తి జర్నలిస్టు అసోసియేశన్ కు 10 గంటల స్థలం కేటాయింపు. ఖమ్మం లో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయించారు. మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీ యాడ్ చేస్తూ నిర్ణయం, కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం. TSPSC లో 10 పోస్టుల మంజూరు చేసారు.