mt_logo

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్, జూన్ 9 :  చేప ప్రసాదం కోసం  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  చేప ప్రసాదం పంపిణీ ని మంత్రి  ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చేప ప్రసాదం ఒక ఆనవాయితీ గా మృగశిర కార్తె రోజు పంపిణి చేయడం జరుగుతుంది. కానీ కరోనా కారణంగా 3 సంవత్సరాల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయలేదు,   వివిధ రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మందికి  ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. శుక్ర, శనివారాల్లో చేప మందును పంపిణీ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం తగు  ఏర్పాట్లును చేసిందని తెలిపారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు, బత్తిన హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదం పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు.