mt_logo

బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే పరివర్తన తెచ్చే ఒక మిషన్: సీఎం కేసీఆర్

  •  బీఆర్ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదు
  • బీఆర్ఎస్  రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీం

సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభను  నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అంటున్నారు. బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, భారతదేశంలో పరివర్తన తెచ్చే ఒక మిషన్. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ. మేము ఇప్పుడిప్పుడే మా ప్రస్థానాన్ని ప్రారంభించాం. 

బీఆర్ఎస్  రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీం

మిగతా పార్టీలకు మా మీద ఎందుకింత ఆక్రోషం ? ఇంత భయమెందుకు ? తొందర పాటెందుకు?మహారాష్ట్రంలో మేం ప్రస్థానాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. ఏ పార్టీ మమ్మల్ని వదలటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రకరకాల ప్రకటనలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కి బి టీం అని కాంగ్రెస్ అంటున్నది.  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి టీం అని బీజేపీ చెప్తున్నది. ఈ టీంలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. మేము ఎవరి టీం కాదు. మేము రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీం. 

 బీఆర్ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదు

ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రకాల నినాదాలిచ్చాయి. కానీ మొట్టమొదటి సారి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఈ నినాదమివ్వలేదు. 60 శాతం పైగా ఉన్న రైతులు, కార్మికులు తమ మద్దతును  బీఆర్ఎస్ పార్టీకి ప్రకటిస్తుండటం వీరికి భయాన్ని కలిగిస్తున్నది. దీంతో అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. వింత వింత ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదు.ఈనాడు దేశం అన్ని సమస్యలకు పరిష్కారం పరివర్తిత (సంస్కరించబడిన) భారతదేశమే అని ప్రసంగించారు సీఎం కేసీఆర్.