తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సరిగ్గా ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ జనగణమణ గీతాన్ని ఆలపించారు. అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజయవంతం చేశారు.